ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా పక్కా హిట్ అవుతుందట.. ఇదిగో ఇదే ఆ మ్యాజిక్!

ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు, దర్శక నిర్మాతలకు సెంటిమెంట్లు అనేవి బాగా ఉంటాయి.

ఒక సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమా విడుదల వరకు ఎన్నో సెంటిమెంట్లు పాటిస్తుంటారు.

కొన్నిసార్లు సెంటిమెంట్ పరంగానే సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు.అలా తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో కూడా ఒక సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా విడుదల కాగా ఈ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.

ఇక ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది.అయితే ఓ విషయం మాత్రం ప్రస్తుతం బాగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

అదేంటంటే ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివకు ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమా సక్సెస్ అవుతుందని అంటున్నారు.అదేంటంటే ఏ దర్శకుడైనా ఒక సినిమాతో డిజాస్టర్ అందుకొని ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఏదైనా సినిమా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమా సక్సెస్ అవుతుందన్న సెంటిమెంట్ నడుస్తుంది.ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన డైరెక్టర్ లు తమ ముందు సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నారు.

దాంతో ఆ సెంటిమెంట్ నే ఇప్పుడు నమ్ముతున్నట్లు తెలుస్తుంది.ఒకవేళ ఈ మ్యాజిక్ ద్వారా కొరటాల, ఎన్టీఆర్ సినిమా సక్సెస్ అయితే మాత్రం.

తమ సినిమాలతో ఫ్లాప్ లు అందుకున్న డైరెక్టరు కచ్చితంగా ఎన్టీఆర్ తో చేయడానికి ముందుకు రావడంలో అనుమానం లేదని చెప్పవచ్చు.మరి కొరటాల, ఎన్టీఆర్ సినిమా ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు