మా సమస్యలు ఇవి.. పరిష్కరించండి: పంజాబ్ ప్రభుత్వానికి 100 రోజుల రోడ్‌మ్యాప్ ఇచ్చిన ఎన్ఆర్ఐలు

ఇటీవల పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పర్గత్ సింగ్‌ను సిక్కు ఎన్ఆర్ఐ ప్రతినిధి బృందం కలిసింది.

వీరిలో ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ సమన్వయకర్త కరణ్ రణ్‌ధవా కూడా వున్నారు.

ఈ సందర్భంగా ప్రతినిధి బృందం మంత్రికి 100 రోజుల రోడ్ మ్యాప్‌ను అందజేసింది.దీనిని వచ్చే 100 రోజుల్లో అమలు చేయాలని పర్గత్ సింగ్‌ను వారు కోరారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడిన పంజాబీ ఎన్ఆర్ఐల నుంచి సమగ్ర సంప్రదింపులు, చర్చల అనంతరం ఫీడ్‌బ్యాక్‌ను 100 రోజుల రోడ్ మ్యాప్‌గా మార్చి ప్రభుత్వానికి సమర్పించినట్లు కరణ్ చెప్పారు.ఎన్ఆర్ఐల కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం, ఎన్ఆర్ఐల పెట్టుబడులను మరింత సులభతరం చేయడానికి హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు వంటి వాటిని మంత్రికి విన్నవించినట్లు ఆయన తెలిపారు.

అలాగే మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల కోసం ఎన్ఆర్ఐలకు పెట్టుబడి బాండ్లను జారీ చేయడం, పీపీపీ పద్ధతిలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయడం వంటి విషయాలపైనా పర్గత్‌కు వివరించినట్లు రణ్‌ధవా తెలిపారు.ప్రధానంగా వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు పంజాబ్‌లో ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Advertisement

ఎన్ఆర్ఐల ఆస్తులను కొందరు అక్రమించుకోవడం, నకిలీ పత్రాలను సృష్టించి తమ సొంతం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.న్యాయ వ్యవస్థలోని లోసుగులను అడ్డుపెట్టుకుని వీరు విచారణ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తున్నారని కరణ్ తెలిపారు.

అలాగే ఎన్ఆర్ఐలు, విదేశీ పెట్టుబడులను సులభతరం చేయడానికి.ప్రభుత్వం ఎన్ఆర్ఐ వ్యవహారాల విభాగాన్ని ఒకే కాంటాక్ట్ పాయింట్‌గా చేస్తే సమస్యలను అధిగమించే అవకాశం వుందని కరణ్ రణ్‌ధవా అభిప్రాయపడ్డారు.

కాగా, కొద్దిరోజుల క్రితం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఎన్ఆర్ఐ సంఘం నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) పర్గత్ సింగ్‌‌కు ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను కేటాయించాల్సిందిగా గట్టి లాబీయింగ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి వేర్వేరుగా రాసిన లేఖల్లో ఎన్ఏపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ కోరారు.

పంజాబీ ప్రవాసులలో ఎక్కువ మంది దోబా ప్రాంతానికి చెందిన వారేనని.అందువల్ల ఎన్ఆర్ఐ వ్యవహారాలను చూసే మంత్రి అదే ప్రాంతానికి చెందినవారై వుండాలని సత్నామ్ సింగ్ సూచించారు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

అందువల్ల ఈ పోర్ట్‌ఫోలియోకు పర్గత్ సింగ్ సరైన వ్యక్తని ఆయన చెప్పారు.ప్రస్తుతం వివిధ దేశాల్లో స్థిరపడ్డ పంజాబీ ప్రవాసులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని.

Advertisement

వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం వుందని సత్నామ్ సింగ్ అన్నారు.అలాగే పంజాబీ ప్రవాసులకు సంబంధించిన వివాదాలపు పరిష్కరించేందుకు గాను దోబా ప్రాంతంలో మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వుండాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజా వార్తలు