కుంభమేళాలో వీఐపీ కల్చర్‌ లేదు

మహారాష్ర్ట ప్రభుత్వం ముందుగానే నిర్ణయం తీసుకున్నదో, లేదా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజు జరిగిన దారుణ ఘటనను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నదో తెలియదుగాని, కుంభమేళాలో వీఐపీ, వీవీఐపీ కల్చర్‌కు అనుమతించలేదు.

గోదావరి పుష్కరాలు ప్రారంభమైన రోజునే కుంభమేళా (పుష్కరాలను అక్కడ కుంభమేళా అంటారట) ప్రారంభమైంది.

అయితే కుంభమేళాలో వీఐపీలుగాని, వీవీఐపీలగాని అందరితో కలిసి స్నానం చేయాల్సిందే.ప్రత్యేకంగా చేస్తామంటే కుదరదు.

వీఐపీలకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని ప్రభుత్వం గ్రహించడం అభినందనీయం.ప్రధాని నరేంద్ర మోదీని కుంభమేళాలో పుణ్యస్నానం చేయాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానించింది.

అయితే ఎటువంటి వీపీఐ మర్యాదలు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించనక్కర్లేదని మహారాష్ర్ట జల వనరుల శాఖ మంత్రి గిరీష్‌ మహాజన్‌ అధికారులను ఆదేశించారు.కుంభమేళాకు ప్రజలు లక్షలాది మంది వస్తారు కాబట్టి శాంతిభద్రతల పేరుతో వారిలో భయాందోళనలు కలిగించకూడదనేది తమ ఉద్దేశమని మంత్రి చెప్పారు.

Advertisement

మొత్తం మీద ఫడ్నవీస్‌ ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది.ఇటువంటి నిర్ణయమే ఏపీ ప్రభుత్వం తీసుకొని ఉంటే దుర్ఘటన జరిగి ముప్పయ్‌ మంది భక్తులు చనిపోయేవారు కాదు.

వీఐపీలకు ప్రత్యేక ఘాట్‌ ఏర్పాటు చేసినా అక్కడ స్నానం చేయకుండా నిబంధనలు ఉల్లంఘించారు చంద్రబాబు.

Advertisement

తాజా వార్తలు