మూడో ఫ్రంట్ కోసం అప్పుడే ప్రయత్నాలా?

బీహార్ ఎన్నికల ఫలితాలు రెండే రోజులైంది.ఇంకా నితీష్ కుమార్ ముఖమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు.

అయినప్పటికీ రాజకీయ నాయకులు అప్పుడే మూడో ఫ్రంట్ ఆలోచనలు చేస్తున్నారట.బీహార్ ఫలితాలు తెచ్చిన ఊపు అలా ఉంది మరి.వచ్చే పార్లమెంటు ఎన్నికలకు మూడున్నర ఏళ్ళ సమయం ఉంది.సామాన్యులకు ఇది ఎక్కువ సమయంగా అనిపించవచ్చు.

కానీ రాజకీయ నాయకులకు ఇది తక్కువ సమయమే.బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఇప్పటినుంచి కూడగడితే ఎన్నికల నాటికి మూడో ఫ్రంట్ ఒక కొలిక్కి వస్తుందని నాయకుల ఆలోచన కావొచ్చు.

ఒక్కో పార్టీది ఒక్కో విధానం.ఒక్కో భావజాలం.

Advertisement

కాబట్టి తలలు కూడటం సులభం కాదు.వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

అవికూడా ముగిశాక మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యే అవకాశం ఉంది.ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు.

ఎన్దీఎలో ఉన్న పార్టీల్లో కొన్ని వచ్చే ఎన్నికల నాటికి అందులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు.బీజేపీ గ్రాఫ్ మరింతగా దిగజారితే మిత్రులు విడిపోయినా ఆశ్చర్యం లేదు.

రాజకీయాల్లో గెలుపు ప్రధానం కాని స్నేహం కాదు.ఎపీకి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు కూడా ప్లేటు ఫిరాయించే ప్రమాదం ఉంది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఈయనకు ఆ చరిత్ర ఉంది కాబట్టి చెయ్యి ఇవ్వడం కొత్త విషయం కాదు.ఏ ప్రాంతీయ పార్టీ వైఖరి ఏమిటో నెమ్మది నెమ్మదిగా బయటపడుతుంది.

Advertisement

తాజా వార్తలు