మీలో టాలెంట్ ఉంటే ఇలా ట్రై చేయండంటున్న గిన్నిస్ రికార్డ్ కొట్టిన కెల్సీ!

పాదాల్ని( Feet ) మీరు ఎపుడైనా అమాంతం వెనక్కి తిప్పరా? అదేంటి అలా అడుగుతున్నారు.

దెయ్యాలు కదా అలా తిప్పేది అని అనుకుంటున్నారా? అయితే అదంతా జరిగేది కేవలం సినిమాలలో మాత్రమే.అయితే నిజజీవితంలో కూడా అలా తమ పాదాలను వెనక్కి తిప్పేవారు( Rotating Feet ) లేకపోలేదు.

ఇపుడు అలాంటి స్పెషల్ టాలెంట్ వున్న వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం.ఒకామె అలా చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో( Guinness Record ) పేరు నమోదు చేసుకుంది.

న్యూ మెక్సికో అల్బుకెర్కీకి చెందిన కెల్సీ గ్రబ్( Kelsey Grubb ) తనకున్న టాలెంట్ ని ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంది.

New Mexico Woman Breaks Guinness World Records By Rotating Her Feet Back-to-fron

అనుకున్నదే తడవుగా ఆలస్యం చేయకుండా ఏకంగా ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టింది.కెల్సీ ఓ లైబ్రరీలో పని చేస్తోంది.ప్రపంచ రికార్డు పుస్తకం కొత్త ఎడిషన్ అక్కడ ఆమెకు కనిపించగా పేజీలు ఒక్కొక్కటీ తిరగేసింది.

Advertisement
New Mexico Woman Breaks Guinness World Records By Rotating Her Feet Back-To-Fron

ఇంతలో పాదాలు రొటేషన్ ఉన్న పేజీని చూసి మిక్కిలి ఆశ్చర్యపోయింది.నేను కూడా ఇలా చేయగలను కదా.అనుకుంది.వెంటనే కెల్సీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వారిని కాంటాక్ట్ చేసింది.ఈ క్రమంలోనే తన పాదాలను 171.4 డిగ్రీలు తిప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్ధానం సంపాదించింది.

New Mexico Woman Breaks Guinness World Records By Rotating Her Feet Back-to-fron

అయితే కెల్సీ ఈ రికార్డ్ కోసం తన పాదాలకు హాని కలిగించే ఏ ప్రయత్నం చేయకపోవడం హర్షణీయం.ఎందుకంటే, ఆమె సహజంగానే పాదాలను తిప్పేయగలదు.ఇది నిజంగానే ఆమెలో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ అని ఆమె ఆరోజు గుర్తించింది.

ఐస్ స్కేటింగ్ కెరియర్‌లో కూడా ఈ టాలెంట్ కెల్సీకి ఎంతగానో ఉపయోగపడిందట.పాదాలు రొటేట్ చేస్తున్నప్పుడు కెల్సీకి కాలు గుండ్రంగా తిరిగినట్లు అనుభూతి కలుగుతుందట.

ఏది ఏమైనా ఎవరికీ సాధ్యం కాని పనులు చేయగలిగితేనే కదా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేది.అని కెల్సీ ఇపుడు చెబుతోంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అంతేకాకుండా మీలో వున్న ప్రత్యేకత ఏమిటో ఒక్కసారి చెక్ చేసుకోండి అని చెబుతోంది కూడా.

Advertisement

తాజా వార్తలు