తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పనిచేస్తూ మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ప్రస్తుతం వరుస సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి వారిలో శైలేష్ కొలను( Sailesh Kolanu ) ఒకరు.ఎక్కడో విదేశాలలో జాబ్ చేస్తున్నటువంటి ఈయన ఒక అద్భుతమైన కథను రాసి నాని( Nani )ని సంప్రదించారు.
ఇలా తన కథతో నానిని మెప్పించిన శైలేష్ ఆయన నిర్మాణంలో విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా హిట్ సినిమా( Hit Movie ) కు దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇలా మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈయన ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం చేసి మరోసారి హిట్ అందుకున్నారు.
ఇక త్వరలోనే హిట్ 3కూడా రాబోతుందని ఇందులో నాని హీరోగా నటించబోతున్నారని వెల్లడించారు.ఇక ఈ సినిమా చేయడానికి కంటే ముందుగా హీరో వెంకటేష్ తో కలిసి సైంధవ్ అనే సినిమాకు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇకపోతే తాజాగా ఈయన కాకినాడ నుంచి హైదరాబాదుకు బయలుదేరారు.ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా ఒక అభిమాని సరదాగా అయితే మా ఇంటికి వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళు అంటూ కామెంట్ పెట్టారు.
ఈ విధంగా అభిమాని తనకు కామెంట్ చేయడంతో బయట హోటల్లో టిఫిన్ చేయడం ఎందుకు అని భావించారేమో కాని శైలేష్ మాత్రం సదరు అభిమాని ఇంటికి వెళ్లి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు.ఇలా తన ఇంటికి వెళ్లి తన అమ్మ చేతి పునుగులు తిని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఆ అభిమానితో కలిసి దిగిన ఫోటోని శైలేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియచేశారు.
ఇలా అభిమాని ఇంటికి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేయడమే కాకుండా వారిది చాలా లవ్లీ ఫ్యామిలీ అంటూ అభిమాని కుటుంబం గురించి శైలేష్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం శైలేష్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.