బీజేపీ లాంటి అవినీతి ప్ర‌భుత్వం ఎన్న‌డు చూడలేదు.. కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆపరేషన్ లోటస్ విఫలమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెబుతున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఆయన ప్రతిపాదించిన విశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఆ ప్రభుత్వానికి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోలేదని నిరూపించేందుకు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటున్నారు.తమ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు 20 కోట్ల రూపాయిల‌ను అయినా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేకపోయారని అన్నారు.75 సంవత్సరాల లో భారతీయ జనతా పార్టీ వంటి అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నడు చూడలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటున్నారు.ఢిల్లీ అసెంబ్లీలో విశ్వస తీర్మానాన్ని కేజ్రివాల్ సర్కార్ ప్రవేశపెట్టడంపై బీజేపీ నేత అమిత్ ఓ ట్వీట్ లో నిలదీశారు.

అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ఎవరు అడిగారని ఆయన ప్రశ్నించారు ఏ ఒక్కరు అడగలేదని కేవలం లిక్కర్ ఎక్సేంజ్, ఎడ్యుకేషన్ కుంభకోణాల నుంచి తప్పుదారి పట్టించేందుకే విశ్వాస తీర్మానం తెచ్చారని అన్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని ప్రకటనల సొమ్ముల ఒత్తిడి మీడియాపై ఉంటుందా లేదా అనేదే చూడాలని అన్నారు.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారి విమర్శలు గుప్పించారు.70 మంది ఎమ్మెల్యేలు ఆఫ్ కి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తమపై తమ విశ్వాస తీర్మానం పెట్టుకుంటే సులభంగానే ఆమోదింప చేసుకుంటారని అన్నారు.

Never Seen A Corrupt Government Like Bjp.. Kejriwals Key Comments, Bjp, Kejriwa

ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఏమనుకుంటుందో అని ఆయన ప్రశ్నించారు.ఇది ప్రజాధనం సమయం వృధా చేయడమేనని అన్నారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఉంటే కాగ్ నివేదికపై చర్చించి మద్యం, పాఠశాల తరగతుల నిర్మాణాలకు సంబంధించి జరిగిన లూటీ వివరాలు ఇవ్వాలన్నారు.2024 లోక్ సభ ఎన్నికలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య జరిగినట్లు ఆప్ చెబుతుంది.విద్య వైద్య రంగాల్లో అద్భుతమైన పనితీరు కనబరుస్తూ జనాదరణ అంతకంతకు పెరిగిపోవడంతో ఆయనను అడ్డుకునేందుకు కేంద్ర సంస్థలను భారతీయ జనతా పార్టీ దుర్వినియోగం చేస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటున్నారు.

Advertisement
Never Seen A Corrupt Government Like BJP.. Kejriwal's Key Comments, BJP, Kejriwa
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

తాజా వార్తలు