నేపాల్ క్రికెటర్ సంచలన రికార్డ్.. ప్రపంచంలోనే ఫస్ట్ బౌలర్‌..!

నేపాల్‌ టీమ్ స్పిన్నర్ సందీప్ లామిచానే( Sandeep Lamichhane ) ఇంటర్నేషనల్ వన్డేల్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఈ బౌలర్ అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర తిరగరాశాడు.

గురువారం ఒమన్‌ టీమ్‌తో జరిగిన ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ మ్యాచ్‌లో ఆదిల్ షఫీక్ వికెట్‌ను తీయడం ద్వారా బౌలర్ సందీప్ ఈ ఘనత సాధించాడు.ఈ నేపాల్ క్రికెటర్ ఇప్పటివరకు ఆడింది కేవలం 42 మ్యాచ్‌లే! అయినా మ్యాచ్ కి రెండు కంటే ఎక్కువ వికెట్ల చొప్పున ఈ టాలెంటెడ్ బౌలర్ 100 వన్డే వికెట్లు సాధించాడు.

ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్‌ 44 మ్యాచ్‌లలో ఈ రికార్డు సృష్టించగా అతడిని నేపాల్ క్రికెటర్ సందీప్ తాజాగా అధిగమించాడు.

Nepal Cricketer Sandeep Lamichanne Sensational Record.. The First Bowler In The

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 310 పరుగులు చేసింది.ఆ తర్వాత ఆతిథ్య జట్టు ఒమన్‌ను 206 పరుగుల వద్ద ఆలౌట్ చేసి, చివరికి 84 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.సందీప్ తన స్పిన్ బౌలింగ్ తో ఈ మ్యాచ్‌లో మ్యాజిక్ చేశాడు.సందీప్22 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.అతను ఐపీఎల్ 2018 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కూడా ఎంపిక అయ్యాడు.

Advertisement
Nepal Cricketer Sandeep Lamichanne Sensational Record.. The First Bowler In The

తద్వారా అతను ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌లో ఆడిన మొదటి, ఏకైక నేపాలీ క్రికెటర్‌గా నిలిచాడు.

Nepal Cricketer Sandeep Lamichanne Sensational Record.. The First Bowler In The

అతను T20Iలలో కూడా అద్భుతమైన ప్రదర్శన చూపించాడు.ఈ స్టార్ ప్లేయర్ ఇప్పటి వరకు ఆడిన 44 టీ20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. ఇకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అతనికి అక్టోబర్ 2021లో ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా అందజేసింది.

Advertisement

తాజా వార్తలు