బాయ్ ఫ్రెండ్ గురకను రికార్డ్ చేసి అమ్ముతున్న ప్రియురాలు.. ఈమె తెలివికి నెటిజన్స్ ఫిదా..!

ఇటీవలే కాలంలో మంచి మార్గంలో డబ్బు సంపాదించాలంటే కాస్త తెలివికి పదులు పెడితే చాలు.కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.

 The Girlfriend Who Is Recording Her Boyfriend's Snoring And Selling It , Spotify-TeluguStop.com

ఈ క్రమంలోనే ఓ యువతికి ఓ విన్నుత ఆలోచన వచ్చింది.తన బాయ్ ఫ్రెండ్( boy friend ) నిద్రిస్తున్న సమయంలో గురకను రికార్డ్ చేసి డబ్బు తెగ సంపాదిస్తోంది.

ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు అతని గురక ఇతరులకు నరకంగా అనిపిస్తుంది.పక్కన గురక పెట్టే వారు ఉంటే కొంతమందికి అసలు నిద్ర అనేదే పట్టదు.

ముందుగా తన బాయ్ ఫ్రెండ్ గురకకు ఇబ్బందిపడిన యువతి తరువాత ఆ గురుకనే సంపాదనగా మార్చుకుంది.వివరాల్లోకెళితే.26 ఏళ్ల అనా మల్ఫెయిర్ ( Ana Mulfair )తన బాయ్ ఫ్రెండ్ గురకను అమ్మి డబ్బు సంపాదిస్తున్న విషయం తానే స్వయంగా ఫేస్బుక్ ద్వారా షేర్ చేసింది.అనా మల్ఫెయిర్ గత ఏడాదికాలంగా తన 33 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ లూయిస్( Louis ) తో రిలేషన్ షిప్ లో ఉంది.

ఇద్దరు కలిసి లివ్-ఇన్ లో ఉన్నారు.అయితే తన బాయ్ ఫ్రెండ్ గురక తో చాలా ఇబ్బంది పడేది.కానీ తన బాయ్ ఫ్రెండ్ కు ఈ విషయం చెబితే తనకు గురక అనేది రాదని చెప్పాడు.

దీంతో తన బాయ్ ఫ్రెండ్ గురకను రికార్డ్ చేసి మరుసటి రోజు అతనికి ప్లే చేసి చూపించింది.దీంతో లూయిస్ కాస్త సిగ్గుపడ్డాడు.ఇక రోజు తన బాయ్ ఫ్రెండ్ గురకను రికార్డు చేయడం ప్రారంభించింది అనా మల్ఫెయిర్.

ఇలా రికార్డు చేస్తూ ఒక సంవత్సరం గడిచిపోయింది.తాను రికార్డు చేసిన గురకను తన స్నేహితులైన సంగీత విధ్వంసలకు వినిపించింది.

అందులో ఒక స్నేహితురాలు Spotify లో ఈ గురక ను అప్లోడ్ చేయమని సలహా ఇచ్చారు.ప్రజలు ఈ గురక శబ్దాన్ని, నిద్రను భంగపరిచే సంగీతంగా భావించడంతో సంపాదన మొదలైంది.

Spotify లో ఈ గురుక వినే వారి సంఖ్య దాదాపుగా 16 వేలకు చేరింది.ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ గురకతో తెగ సంపాదిస్తోంది అనా మల్ఫెయిర్.

ఈమె తెలివితేటలకు నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube