గుర్తు పెట్టుకో.. వడ్డీతో సహా తిరిగొస్తుంది.. వైరల్ అవుతున్న నయన్ సంచలన పోస్ట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన నయనతార( Nayanthara ) ధనుష్( Dhanush ) కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సంచలన పోస్ట్ చేశారు.

అబద్దాలతో పక్కవారి జీవితాన్ని నాశనం చేస్తే దానిని మీరొక అప్పుగా భావించండి.

ఏదో ఒకరోజు మీకు వడ్డీతో సహా తిరిగొస్తుందని గుర్తు పెట్టుకోండి అని నయనతార పేర్కొన్నారు.నయన్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్( Nayanthara: Beyond the Fairy Tale ) ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.నయనతార విఘ్నేష్ శివన్ తో( Vignesh Shivan ) ఏ విధంగా ప్రేమలో పడ్డారో ఇందులో ప్రధానంగా చూపించారు.

నయన్ విఘ్నేష్ కాంబోలో తెరకెక్కిన తొలి సినిమా నేనూ రౌడీనే( Nenu Rowdy Ne ) కాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు, పాటలను డాక్యుమెంటరీ కోసం వినియోగించుకోవాలని నయనతార, విఘ్నేష్ శివన్ భావించారు.అయితే అందుకు ధనుష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం గమనార్హం.

ట్రైలర్ లో నేనూ రౌడీనే సినిమాకు సంబంధించి మూడు సెకన్ల క్లిప్ ను వాడుకున్న నేపథ్యంలో అందుకు పరిహారంగా 10 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులను పంపించడం జరిగింది.అయితే ధనుష్ ఈ విధంగా చేయడంపై నయన్ సీరియస్ అయ్యారు.ధనుష్ తీరును తప్పుబడుతూ ఆమె మూడు పేజీల బహిరంగ లేఖను రిలీజ్ చేశారు.

Advertisement

కాంట్రవర్సీకి కారణమైన సీన్స్ ను అలాగే ఉంచడం గమనార్హం.ధనుష్ తాజాగా హైకోర్టులో దావా దాఖలు చేసిన నేపథ్యంలో నయన్ ఈ పోస్ట్ పెట్టారని తెలుస్తోంది.నయన్ తరపు న్యాయవాది ఈ వివాదం గురించి మాట్లాడుతూ డాక్యుమెంటరీలో ఉపయోగించిన విజువల్స్ సినిమాలోవి కావని చెప్పారు.

అవి బీటీఎస్ కు సంబంధించినవని పేర్కొన్నారు.అవి వ్యక్తిగత లైబ్రరీలో భాగమని కాబట్టి అది ఉల్లంఘనల కిందికి రాదని చెప్పుకొచ్చారు.

ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హిట్ ఇవ్వగలడా.. ఆ ఫ్లాప్ చూసి టెన్షన్ మొదలైందిగా!
Advertisement

తాజా వార్తలు