మేనకోడలితో స్టెప్పులేసిన‌ చెర్రీ.. సూప‌రంటున్న నెటిజ‌న్లు!!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశ‌ల్లోనూ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడిచారు.

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాక్సిన్ కూడా లేక‌పోవ‌డంతో.దీనిని అదుపు చేయ‌డం సాధ్యం కావ‌డం లేదు.

దీంతో క‌రోనా నుంచి ర‌క్షించుకునేందుకు అంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు.ఇక ప్ర‌తిరోజు షూటింగ్స్ బిజీ బిజీగా ఉండే సెల‌బ్రెటీలు సైతం ఇంటిప‌ట్టునే ఉంటున్నారు.

ఈ క్ర‌మంలోనే సెలబ్రెటీలు తమకు నచ్చిన పనులు చేసుకుంటూ.లాక్ డౌన్ రోజులను లవ్లీగా మార్చుకుంటున్నారు.

Advertisement

అలాగే కొందరు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేధిక‌గా.త‌మ‌కు సంబంధించిన విష‌యాలు అభిమానుల‌తో పంచుకుంటూ ట్రెండ్ అవుతున్నారు.

ఇక తాజాగా టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.తన సోదరి శ్రీజ కూతురు నవిష్కతో కలిసి డ్యాన్స్ చేశాడు.

టీవీ ముందు నిల్చుని చెర్రీ, నవిష్క డ్యాన్స్ చేసిన వీడియో.రామ్ చ‌ర‌ణ్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.ఈ క్ర‌మంలోనే కొంద‌రు నెటిజ‌న్లు సూప‌రంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
వేరే హీరో రిజెక్ట్ చేసిన కథలతో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ...

కాగా, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా క‌నిపించ‌నున్నారు.

Advertisement

ప్ర‌స్తుతం అందరి దృష్టీ ఈ సినిమా వైపే ఉంది.ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న స‌మ‌యంలో.

అంద‌రి ఆశలకు నీళ్లు చ‌‌ల్లుతూ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కి బ్రేక్ వేసింది కరోనా.

తాజా వార్తలు