కోడలి గుర్తింపు పొందాలంటే ఆ మొక్కు తీర్చుకోవాల్సిందేనట!

ఆదివాసీలు, గిరిజనుల ఆచారాలు చాలా వింతగా, కొత్తగా అనిపిస్తుంటాయి మనకు.వారి పూజలు ఎక్కువగా ప్రకృతితోనే మమేకమై ఉంటాయి.

చెట్టు, పుట్ట, చేను, అడవి చుట్టూనే వారి దేవతలు కనిపిస్తాయి.అలాంటిదే ఈ నాగోబా జాతర కూడా.

అయితే నాగోబా దేవతను కేవలం జాతర అప్పుడే కాకుండా కొత్తగా పెళ్లైన జంటలు పెళ్లైన వెంటనే.అమ్మవారిని దర్శించుకోవడం తప్పనిసరి అంట.కొత్త పెళ్లి కూతురు పెళ్లైన తర్వాత నాగోబా దేవతను కచ్చితంగా దర్శించుకొని మొక్కు చెల్లించుకోవాలంట.అలా చేయని పక్షంలో ఆమె కోడలిగా గుర్తింపు పొందనట్లేనట.

ఈ విషయం వినడానికి కొత్తగా, వింతగా ఉన్నప్పటికీ.ఇది ఎప్పటి నుంచో సాగుతుందట.

Advertisement

అంతే కాకుండా మెస్రం వంశీయుల్లో ఎవరైనా చనిపోతే.ఇక్కడే కర్మకాండలు నిర్వహిస్తారట.

అలా చేస్తేనే.చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు గిరిజిన ప్రజలు.

ప్రతీ ఏటా నాగోబా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.లక్షల్లో గిరిజనులంతా ఒక్క చోట చేరి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు.

తన ఐకత్యను చాటి చెప్తారు.ఇలా ప్రతీ ఏటా నాగోబా దేవతను పూజించడం వల్ల ఎలాంటి ఆపదలు రావని, ఏడాదంతా మంచి జరుగుతుందని ఆదివాసీల నమ్మకం.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
మీ ఇంట్లో ఈ వస్తువులు అయిపోతే.. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం..!

అందుకే ఏడాదంతా ఎక్కడున్నా పండుగ పూట మాత్రం కచ్చితంగా జాతరకు వస్తుంటారు గిరిజన ప్రజలు.ఇటీవలే ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు మెస్రం వంశీయులు.వందలాది మంది గంగాజలం తీసుకొచ్చి.

Advertisement

లక్షలాది మంది భక్తుల ఎదుట అభిషేకాలు చేశారు.ఘనంగా జాతరను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

తాజా వార్తలు