Akkineni Nagarjuna: నాగార్జున కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అయిన టాప్ 10 సినిమాలు ఏంటో తెలుసా..?

అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అక్కినేని నాగార్జున.( Akkineni Nagarjuna ) నవ మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున.

సినిమాల్లో అన్ని రకాల పాత్రలు చేశాడు.భక్తి సినిమాలతో నాగార్జున స్టార్‌డమ్ తెచ్చుకోగా.

అలాగే యాక్షన్, లవ్ సినిమాలు కూడా నాగార్జునకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.మూడున్నర దశాబ్ధాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఇప్పటికీ తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న నాగార్జున కెరీలో టాప్ 10 బ్లాక్ బస్టర్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Nagarjuna Top 10 Block Busters In His Career Geetanjali Manam Manmadhudu Shiva
Advertisement
Nagarjuna Top 10 Block Busters In His Career Geetanjali Manam Manmadhudu Shiva-

నాగార్జున కెరీర్‌లో గీతాంజలి( Geetanjali Movie ) ఎవర్ గ్రీన్ సినిమాగా చెప్పవచ్చు.మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాకు ఇళయరాజా పాటలు ఎస్సెట్‌గా నిలిచాయి.మంచి ప్రేమ కథను ఈ సినిమాలో చూపించగా.

క్యాన్సర్ బారినపడ్డ రోగి పాత్రలో నాగార్జున తన నటనతో అందరికీ కన్నీళ్లు తెప్పించాడు.ఇక శివ సినిమా(Siva Movie ) తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

ఆర్జీవీ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగార్జున హీరోగా, అమల హీరోయిన్ గా నటించారు.ఇక కోందండరామిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన హలో బ్రదర్( Hello Brother Movie ) సినిమాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి.

హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్‌లో నటించాడు.

Nagarjuna Top 10 Block Busters In His Career Geetanjali Manam Manmadhudu Shiva
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య సినిమా( Annamayya Movie ) నాగార్జునకు మంచి పేరు తెచ్చి పెట్టింది.ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డును నాగార్జున అందుకున్నారు.ఇక నువ్వు వస్తావని, మన్మథుడు, మనం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలకు భారీ కలెక్షన్లు వచ్చాయి.

Advertisement

మన్మథుడు( Manmadhudu Movie ) సినిమాలోని అమ్మాయిలంటే పడని అభిరామ్ పాత్రని నాగ్ పోషించాడు.ఈ సినిమా బాగా నచ్చడంతో మన్మథుడు టైటిట్ కాస్త నాగ్‌కి ముద్దు పేరైపోయింది.

ఇక మనం సినిమాలో( Manam Movie ) తన తండ్రి అక్కనేని నాగేశ్వరరావు, కుమారుడు అక్కినేని నాగచైతన్యతో నాగ్ నటించాడు.అక్కినేని నాగేశ్వరరావు చివరిగా నటించిన సినిమా ఇదే కావడం విశేషం.

తాజా వార్తలు