కేంద్రం జోక్యంతో సద్దుమణిగిన వివాదం

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ డ్యామ్ పై నెలకొన్న నాలుగు రోజుల హైడ్రామాకు ఆదివారం తెరపడింది.

కేంద్రం జోక్యంతో ఉభయ తెలుగు రాష్ట్రాల అంగీకారంతో డ్యాంను సిఆర్పిఎఫ్ బలగాలు ఆధీనంలో తీసుకున్నాయి.

అనంతరం డ్యాంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా వేసిన కంచెను,భారీ కేడ్లను తొలగించారు.ప్రాజెక్ట్ పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణ బోర్డు కేంద్ర బలాగాలకు అప్పగించడం,దానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించిన నేపథ్యంలో సాగర్‌ జలాల విడుదల వివాదానికి తెర పడింది.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో శుక్రవారం కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో డ్యామ్‌ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించిన విషయం తెలిసిందే.సీఆర్పీఎఫ్‌ దళాల పర్యవేక్షణకు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ సిఆర్పిఎఫ్ బలగాల రాకతో తెలంగాణ పోలీస్ బలగాలు శనివారం డ్యామ్ వదిలి వెళ్లారు.

కానీ,ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్యామ్ ఆదివారం ఉదయం వరకు డ్యామ్ మీదనే ఉండి పహారా కాశారు.దీనితో ఆంధ్ర,తెలంగాణ వైపు నుండి కేంద్ర బలగాలు డ్యాంపైకి చేరుకొని కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా ఆదేశానుసారం ఆంధ్ర పోలీసులు వేసిన కంచెను,భారీకేడ్లను తీసివేయాల్సిందిగా కోరడం జరిగింది.6వ తేదీ వరకు కేంద్ర బలగాల చేతిలోనే ఉంటుంది.6వ తేదీన అనంతరం జరిగే చర్చల్లో వేలువడే సూచనలు,సలహాలు పాటించాలని అప్పటి వరకు డ్యామ్ వదిలి వెళ్లిపోవాలని తెలంగాణ వైపు అసిస్టెంట్ కమాండెంట్ షరీఫ్ అలీ, ఆంధ్ర వైపు అసిస్టెంట్ కమాండెంట్ కుల్దీప్ కు సూచించారు.దీనితో ఆంధ్ర పోలీసులు డ్యామ్ వదిలి వెళ్లిపోయారు.

Advertisement

శనివారం అర్ధరాత్రి నాగార్జునసాగర్ కుడికాలువకు నీటిని నిలుపుదల చేశారు.గతంలో సాగర్ డ్యాంకు భద్రత కల్పించిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ తెలంగాణ వైపు ఉన్న ఎర్త్ డ్యామ్, డ్యామ్ మెయిన్ గేట్ వరకే పరిమితం కానున్నారు.

కేంద్ర బలగాలతో పాటు ఎన్ఎస్పీ ఎస్ఈ నాగేశ్వరావు,ఈఈ మల్లికార్జున,డిఈ శ్రీనివాస్,ఏఈ కృష్ణయ్య పర్యవేక్షణ చేస్తున్నారు.

Advertisement

Latest Nalgonda News