సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు, నా సామిరంగ.. అలాంటి కథలలో నటిస్తే నాగార్జునకు తిరుగులేదా?

స్టార్ హీరో నాగార్జునకు గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే.నాగార్జున వరుసగా సినిమాలలో నటిస్తున్నా మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి.

అయితే నాగార్జున( Nagarjuna ) సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలైతే మాత్రం బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలతో ఇప్పటికే ఈ సెంటిమెంట్ నిజమని ప్రూవైంది.

నా సామిరంగ సినిమాతో ఈ సెంటిమెంట్ నిజమేనని నాగ్ మరోసారి ప్రూవ్ చేయడం జరిగింది.పల్లెటూరి బ్యాక్ డ్రాప్ కథలలో నటిస్తే నాగార్జునకు తిరుగులేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నా సామిరంగ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

నాగార్జున అభిమానులు సైతం ఈ సినిమా తమకు ఎంతగానో నచ్చిందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

నా సామిరంగ సినిమాలో చిన్నచిన్న లోపాలు ఉన్నా పండుగకు మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.నా సామిరంగ( Naa Saami Ranga ) సినిమాకు సరైన థియేటర్లు దక్కకపోవడం కొంతమంది అభిమానులను బాధ పెడుతోంది.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా పండుగకు మంచి సినిమా చూడాలని భావించే వాళ్లకు హనుమాన్ తర్వాత ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

నాగార్జున, అషికా రంగనాథ్ నటన, పండుగకు సరైన సినిమా కావడం నా సామిరంగ సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా సెకండాఫ్ లో కథనం కొంత నెమ్మదిగా సాగడం, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునేలా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.నాగార్జున నా సామిరంగ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు