బంగార్రాజు మొదటి రోజు వసూళ్ల పరిస్థితి ఏంటీ?

నాగార్జున మరియు నాగచైతన్యలు కలిసి నటించిన బంగార్రాజు సినిమా పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

సంక్రాంతి సందర్బంగా విడుదల అయిన ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు నమోదు అయినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

సినిమా మొదటి ఆట కాస్త నీరసంగా వసూళ్లు నమోదు అయ్యాయి.కాని సినిమాకు వచ్చిన పాజిటివ్‌ టాక్ తో అనూహ్యంగా వసూళ్లు పెరిగాయి.

భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమా అవ్వడం వల్ల వసూళ్లు ఖచ్చితంగా పాజిటివ్‌ గా వస్తాయని అంతా ఆశిస్తున్నారు.రికార్డు స్థాయి వసూళ్ల సంగతి ఏమో కాని మొదటి రోజు ఈ సినిమాకు దాదాపుగా పది కోట్ల వరకు వసూళ్లు నమోదు అయినట్లుగా చెబుతున్నారు.

అధికారికంగా లెక్కలు రాలేదు కాని ఆ నెంబర్ కు కాస్త అటు ఇటుగా ఉండటం ఖాయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బంగార్రాజు సినిమా సంక్రాంతికి తగ్గ సినిమా.

Advertisement

అందుకే అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.రికార్డు స్థాయి టికెట్ల రేట్లు తెలంగాణలో ఉండగా.

ఏపీలో అతి తక్కువ టికెట్ల రేట్లు ఉన్నాయి.అయినా కూడా జనాలు అక్కడ ఇక్కడ రెండు చోట్ల చూస్తూనే ఉన్నారు.

బంగార్రాజు సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

కనుక ఆమె అభిమానులు కూడా ఈ సినిమా ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.మొత్తానికి ఈ సినిమా మొదటి వారం రోజుల్లో ఖచ్చితంగా 50 కోట్లకు మించిన వసూళ్లు రాబట్టే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్‌ పండితులు అంటున్నారు.బంగార్రాజు సినిమా లో పలువురు హీరోయిన్స్ సందడి చేశారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

వారి అప్పియరెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు