నాగశౌర్య-అవసరాల సినిమా క్యాన్సిల్! తప్పుకున్న నిర్మాత

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అష్టాచెమ్మా సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడుగా ముద్ర వేసుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్.

ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు అందులో హీరోగా నటించిన నాగశౌర్యకి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

మళ్ళీ అవసరాల జో అచ్యుతానంద అనే సినిమా చేశాడు.అది కూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

Naga Shourya And Avasarala Movie Canceled-నాగశౌర్య-అవసర

ఇది కూడా క్లాస్ టచ్ ఉన్న సినిమానే.ఓ వైపు నటుడుగా ఫుల్ బిజీగా ఉన్న దర్శకుడుగా సినిమాలు చేసే ప్రయత్నం అవసరాల చేస్తూనే ఉన్నాడు.

అందులో భాగంగా రెండేళ్ళ క్రితం నాగశౌర్యతోనే మూడో సినిమా కూడా ప్రకటించి షూటింగ్ కూడా మొదలెట్టాడు.మూడో సినిమాని నాగ శౌర్యతోనే ప్లాన్ చేశాడు.

Advertisement

ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అయ్యింది.సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చారు.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో జరిగింది.తరువాత ఏవో కారణాల వలన సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

అలా సినిమా రెండేళ్ళుగా ముందుకి కదలకుండా ఆగిపోయింది.ఇదే సమయంలో అవసరాల శ్రీనివాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు.

శౌర్య కూడా తన మార్కెట్ పెంచుకొని కమర్షియల్ హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా అవసరాల శ్రీనివాస్ శౌర్యతో సినిమాని క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
కోలీవుడ్ హీరోతో చరణ్ మల్టీస్టారర్ మూవీ... ఖుషి అవుతున్న మెగా ఫాన్స్! 

సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి రావడంతో సాయి కొర్రపాటి అంత బడ్జెట్ నాగ శౌర్య మీద ఇప్పుడున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టలేనని చేతులెత్తేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలోనే ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు తెలుస్తుంది.

Advertisement

మరి ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలుగా దర్శకుడు గాని ఎలాంటిఅ అఫీషియల్ ప్రకటన చేయలేదు.

తాజా వార్తలు