చంద్రబాబు, లోకేష్ లపై ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( Avinash Reddy ) టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు మరియు లోకేష్ లపై సెటైర్లు వేశారు.

ఈ ఇద్దరు నేతలు తమ జిల్లాల పర్యటించిన క్రమంలో వర్షాభావ పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.

తాజాగా కడప జిల్లా వేముల మండలం నల్లచెరువు పల్లెలో ఎండిపోయిన వేరుశనగ పంటను అవినాష్ రెడ్డి పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు అవసరానికి మించి వర్షాలు పడ్డాయని పేర్కొన్నారు.

MP Avinash Reddy's Sensational Comments On Chandrababu And Lokesh , MP Avinash R

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పుడు సీఎం వైఎస్ జగన్( CM jagan ) పాలనలో అవసరమైన మేరకు వర్షాలు కురిసాయని స్పష్టం చేశారు.ఈ ఐదవ సంవత్సరం ఎందుకు వర్షాలు పరవాలేదని ప్రశ్న జిల్లాలో నెలకొన్న క్రమంలో.

రెండు బలమైన పాదాల పర్యటన వల్ల వర్షాభావ పరిస్థితులు తారుమారయ్యాయని అన్నారు.ఈ విషయం గ్రామాల్లో ఉన్న ప్రజలే చెబుతున్నారని పంచ్ లు వేయడం జరిగింది.

Advertisement

సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి కార్యక్రమంలో జిల్లాలో చంద్రబాబు( Chandrababu naidu ) పాల్గొన్నారు.లోకేష్ జిల్లాలో పాదయాత్ర చేశారు.

ఈ ఇద్దరు నేతలు జిల్లాలో పర్యటించడం వల్ల వర్షాలు పడలేదని రైతులు చెప్పుకుంటున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు