తెల్ల జుట్టుకు దూరంగా ఉండాలా? అయితే ఈ నూనెను వాడండి!

ఇటీవ‌ల కాలంలో చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో వ‌చ్చే మార్పులు, పోష‌కాల కొర‌త‌, కాలుష్యం, కెమికల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్లబ‌డిపోతుంటుంది.అయితే ఈ స‌మ‌స్యకు దూరంగా ఉండాలీ అనుకునే వారికి మోరింగ ఆయిల్.

అదేనండీ మున‌గ నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మునక్కాయల్లో ఉండే గింజలను ఎండ బెట్టి వాటిని నుంచి తీసిన నూనెనే మునగ నూనె అని అంటారు.

ఈ నూనెలో ఉండే కొన్ని ప్ర‌త్యేకమైన పోష‌కాలు కేశాల‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.మ‌రి లేటెందుకు జుట్టుకు మున‌గ నూనెను ఎలా వాడాలి.? అన్న‌ది చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు స్పూన్ల కొబ్బ‌రి నూనె, ఒక స్పూన్ మున‌గ నూనె వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

Advertisement
Moringa Oil Prevent You From White Hair!, Moringa Oil, White Hair, Latest News,

ఇప్పుడు ఈ ఆయిల్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ప‌ది నుంచి ప‌ది హేను నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే తెల్ల జుట్టు స‌మ‌స్యే ద‌రి చేర‌దు.

ఒక వేళ జుట్టు తెల్ల బ‌డినా.న‌ల్ల‌గా నిగారింపుగా మారుతుంది.

Moringa Oil Prevent You From White Hair, Moringa Oil, White Hair, Latest News,

అలాగే త‌మ జుట్టు బ‌ల‌హీనంగా ఉంద‌ని అనుకునే వారు.తలస్నానం చేసిన తరువాత కేశాలు కాస్త తడిగా ఉన్నప్పుడే మునగ నూనెను కుదుళ్ల‌కు సీర‌మ్ మాదిరిగా అప్లై చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు దృఢంగా మారి ఊడ‌టం త‌గ్గుతుంది.

ఇక కొంద‌రికి జుట్టు చివ‌ర్ల‌న చిట్లిపోతూ ఉంటుంది.అయితే అలాంటి వారు మున‌గ నూనెను డైరెక్ట్‌గా జుట్టు చివ‌ర్ల‌న అప్లై చేయాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే చిట్లిన జుట్టు మ‌ళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు