మోకాళ్ళ నొప్పులకు దివ్యౌషధం మునగాకు.. ఇలా తీసుకుంటే మందులు కూడా వాడక్కర్లేదు!

ఇటీవల రోజుల్లో ఎంతో మంది మోకాళ్ళ నొప్పులతో మదన పడుతున్నారు.వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని మోకాళ్ళ నొప్పులు వేధిస్తున్నాయి.

మోకాళ్ళ నొప్పుల వల్ల ఎక్కువ సేపు నిలబడాలన్నా.నడవాలన్నా.

మెట్లు ఎక్కాలన్నా చాలా ఇబ్బందిగా, బాధాకరంగా ఉంటుంది.ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు మునగాకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.మోకాళ్ళ నొప్పులకు దివ్యౌషధంగా మునగాకు( Drumstick leaves ) పని చేస్తుంది.

Advertisement

ఇప్పుడు చెప్పబోయే విధంగా మునగాకును తీసుకుంటే మందులు కూడా వాడక్కర్లేదు.సహజంగానే మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో అర కప్పు ఫ్రెష్ మునగాకు వేసుకోవాలి.అలాగే అర అంగుళం పొట్టు తొలగించి దంచిన అల్లం ( Ginger )ముక్క మరియు పావు టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము( TURMERIC CONES ) తురుము వేసుకొని ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్ట‌వ్‌ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ మునగాకు వాటర్ ను తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.ఎముకల బలహీనత దూరం అవుతుంది.

దీంతో మోకాళ్ళ నొప్పులు దెబ్బకు పరార్ అవుతాయి.అలాగే ఈ మునగాకు వాటర్ ను తీసుకోవడం వల్ల దంపతుల్లో లైంగిక సమస్యలు( Sexual problems ) తగ్గుముఖం పడతాయి.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.అంతేకాదు.

Advertisement

ఈ మునగాకు వాటర్ ను నిత్యం తాగడం వల్ల బాడీ వెయిట్ కంట్రోల్( Weight Control ) లో ఉంటుంది. జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

మరియు ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రమే కాదు ఎవరైనా సరే ఈ మునగాకు వాటర్ ను తీసుకోవచ్చు.

తాజా వార్తలు