ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ వాయిదా

తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు విచారణ వాయిదా పడింది.

ఈ కేసును విచారించేందుకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఈ క్రమంలో ఆడియోలు, వీడియోలు బయటకు రావడంపై కోర్టు ఆరా తీసింది.కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు అయ్యే వరకు ఆడియోలు, వీడియోలు బయటకు రాకూడదు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది.

అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement