కేసీఆర్ కు ఏ.బీ.ఎన్ మరో షాక్!!

కేసీఆర్ మొనార్క్ పద్దతి ప్రజలనే కాదు.మీడియాను సైతం ఇబ్బందులకు గురి చేస్తుంది.

విషయం ఏమిటంటే.ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న మీడియాలో అన్ని చానెళ్లు దాదాపు కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటునట్లు కనిపిస్తుంది.

ఇక ఇదే క్రమంలో ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే తెలంగాణ సర్కారుపై అప్రకటిత యుద్ధం చేస్తూ వస్తోంది.ఇక కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఏబీఎన్ ఛానల్ పై అనధికార నిషేధం విధించడం ద్వారా కేసీఆర్- రాధాకృష్ణల వైరం మొదలైంది.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ రాధాకృష్ణ కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేక వార్తలు ఇచ్చారు.ఇక ఇప్పుడైతే.

Advertisement

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చుక్కలు చూపిస్తున్నారు.అవినీతిపై రాజీపడనంటున్న కేసీఆర్ కు ఆయన మంత్రివర్గ సభ్యులకు చెందిన అవినీతి బాగోతాలపై వరుస కథనాలు ప్రచురిస్తూ షాకుల మీదు షాకులిస్తున్నారు.

అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏకంగా ఉపముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేయించడంతో రాధాకృష్ణ ఆ ఘటనను అవకాశంగా మాలచుకున్నారు.తెలంగాణ మంత్రుల అవినీతిని టార్గెట్ చేస్తూ కథనాలు ఇస్తున్నారు.

మొన్నటికి మొన్న ఇసుక దందా పై సంచలన కథనం ఇచ్చిన రాధాకృష్ణ.ఇప్పుడు మరో తెలంగాణ మంత్రి మహేంద్ర రెడ్డి సోదరుడి అక్రమాలపై కథనం ఇచ్చారు.

మహేంద్రరెడ్డి సోదరుడు నరేంద్ర రెడ్డి ఓ పార్కు స్థలాన్ని కబ్జా చేశారంటూ వార్త రాశారు.చందానగర్ వద్ద ఒక పార్కు స్థలాన్ని కబ్జా చేసి ముప్పై ప్లాట్లు వేశారన్నది ఆ కథనం సారాంశం.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
సుకుమార్ కూతురును మెచ్చుకున్న రామ్ చరణ్ దంపతులు.. అసలేం జరిగిందంటే?

ఐతే ఆంధ్రజ్యోతి కథనాలపై ప్రభుత్వం పెద్దగా స్పందించడం లేదు.రాజయ్యను బర్తరఫ్ చేశారు.

Advertisement

సరే.వీరిసంగతేంటి అని ప్రశ్నిస్తున్న ఆంధ్రజ్యోతికి గులాబీదళం నుంచి సరైన స్పందన కనిపించడం లేదు.అంటే దాదాపుగా వారి తప్పులను వారు ఒప్పుకున్నట్లే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

ఏది ఏమైనా ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.

తాజా వార్తలు