కేంద్రంపై మంత్రి హరీశ్ రావు విమర్శనాస్త్రాలు

కేంద్రంపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేంద్రం తెచ్చిన నోట్ల రద్దు లక్ష్యం నెరవేరకపోగా దొంగనోట్ల చలామణీ పెరిగిపోయిందని మండిపడ్డారు.

ఫేక్ కరెన్సీ 54 శాతం పెరిగిందని ఆర్బీఐనే నివేదిక ఇచ్చిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.నగదు చలామణీ కూడా గతంలో కంటే రెట్టింపు అయిందన్నారు.

కానీ డిజిటల్ లావాదేవీలు పెరగాలన్న హరీశ్ రావు నగదు చలామణీ తగ్గాలని చెప్పారు.బీజేపీ అధికారంలోకి రాకముందు దేశ జీడీపీలో నగదు చలామణీ 11 శాతం ఉందన్నారు.దేశ జీడీపీలో నగదు చలామణీ 13.7 శాతానికి పెరిగిందని వెల్లడించారు.బీజేపీ అధికారంలోకి రాకముందు చలామణీలో ఉన్న నగదు రూ.13 లక్షల 2 వందల కోట్లని పేర్కొన్నారు.

విశ్వక్ సేన్ కు జోడీగా డ్రాగన్ బ్యూటీ.. టాలీవుడ్ లో ఈమె బిజీ కావడం ఖాయమా?
Advertisement

తాజా వార్తలు