Minister Ambati Rambabu: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బాలాన్నిస్తున్నాయీ - మంత్రి అంబటి రాంబాబు

అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్నిస్తున్నాయని తెలిపారు.

రాజధానిని 3 నెలలు లేదా 6 నెలల్లోనే నిర్మించాల్సిన అవసరం లేదని అంబటి స్పష్టం చేశారు.రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు.

Minister Ambati Rambabu About Supreme Court Comments On Ap Three Capitals, Minis

ఇక అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చినట్టేనని పేర్కొన్నారు.గ్రాఫిక్స్ చూపించారు తప్ప అమరావతిలో నిర్మాణాలు చేయలేదని విమర్శించారు.

రైతుల వేషాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని ఆరోపించారు.అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.

Advertisement

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయినా, రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను చంద్రబాబు ఆపాలని అంబటి హితవు పలికారు.ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా అంబటి విమర్శలు చేశారు.

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఒక పెద్ద జోకర్ అని అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు