మహేష్ ఆ నిర్ణయం వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే.. అదిరిపోయిందిగా..

తెలుగు హీరోల్లో పాన్ ఇండియా జపం చేయని హీరో ఎవరంటే అది ఇప్పటి వరకు ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే అని చెప్పాలి.

తనకు తెలుగు సినిమా చేయడమే ద్రుష్టి అంతా తెలుగు సినిమాపైనే ఉందని చెబుతూ వస్తున్నాడు.

అయితే తన సినిమాలు అన్ని బాషల వారికీ రీచ్ అయితే హ్యాపీ అని పేర్కొన్నారు.సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.

ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ రోజు థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట.

Advertisement
Master Plan Behind The Superstar Mahesh Babu Decision, Mahesh Babu, Sarkaru Vaar

ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూడగా వారి ఎదురు చూపులు ఈ రోజుతో తీరిపోయాయి.అయితే ఈ సినిమాను హిందీలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించిన మహేష్ కోరిక మేరకు అలా చెయ్యలేదు.

అయితే దీని వెనుక బలమైన కారణం ఉందట.ఈ సినిమా హిందీలో రిలీజ్ అయ్యి కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాకపోతే అక్కడ తన మార్కెట్ పడిపోవడమే కాకుండా నెక్స్ట్ సినిమా బిజినెస్ పరంగా డల్ అవుతుంది.

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో చేసే సినిమా కూడా పాన్ ఇండియా కాదని తెలుస్తుంది.

Master Plan Behind The Superstar Mahesh Babu Decision, Mahesh Babu, Sarkaru Vaar

మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.మహేష్ కూడా ఈ సినిమాతోనే పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ గా లాంచ్ అవ్వాలని అప్పుడే ఈయన పాన్ ఇండియా స్టార్ గా మారతాడని ఆలోచిస్తున్నాడట.అందుకే ఇప్పుడు సర్కారు సినిమా కానీ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా కానీ పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

మరి మహేష్ ప్లాన్ వింటే ఇదే నిజం అనిపిస్తుంది.ఈయన సినిమా అయితేనే ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ లా మహేష్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోతాడు.

Advertisement

తాజా వార్తలు