ప్రపంచంలో మార్క్స్ సిద్ధాంతమే అజేయం:- సిపిఎం

నేటి ఆధునిక ప్రపంచంలో మార్క్స్ సిద్ధాంతమే అజేయమైనదని ఖమ్మం జిల్లా వైరా పట్టణ సిపిఎం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు బొడపట్ల రవీందర్, జిల్లా రాజకీయ విద్యా విభాగం సభ్యులు పారుపల్లి చంద్రశేఖర్ బాబు అన్నారు.

బుధవారం కార్ల్ మార్క్స్ 204వ జయంతిని స్థానిక బోడేపూడి భవనంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్ర పటానికి పారుపల్లి చంద్రశేఖర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సిపిఎం వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్ అధ్యక్షతన జరిగిన సభలో బొడపట్ల రవీందర్, పారుపల్లి చంద్రశేఖర్ బాబు మాట్లాడుతూ కార్ల్ మార్క్స ప్రపంచంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి మార్క్సిజం సిద్ధాంతం ద్వారా పరిష్కారం చూపాడని అన్నారు.

ప్రపంచ మానవాళికి ఉత్పత్తిలో శ్రమకు, శ్రమ శక్తికి మధ్య తేడాను వివరించి పెట్టుబడిదారుల దోపిడీని బయటపెట్టిన గొప్ప తత్వవేత్త కార్ల్ మార్క్సు అని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు చింతనిప్ప చలపతిరావు, మల్లెంపాటి రామారావు, గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరరావు, సంక్రాంతి నరసయ్య, అనుమోలు రామారావు, గుడిమేట్ల మోహన్ రావు, సంక్రాంతి పురుషోత్తమరావు, మందడపు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, షేక్ నాగుల్ పాషా, మందడపు విశ్వాశాంతి, తదితరులు పాల్గొన్నారు.

Elon Platform Overview And Key Features For UK Players
Advertisement

Latest Khammam News