మన్మథుడు రీరిలీజ్ దెబ్బకు వరుణ్ తేజ్ మూవీ థియేటర్లు ఖాళీ.. అక్కడ కూడా హౌస్ ఫుల్ అంటూ?

కింగ్ అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మన్మథుడు సినిమా( Manmadhudu Movie ) కూడా ఒకటి.

విజయ భాస్కర్ డైరెక్షన్ లో త్రివిక్రమ్ అదిరిపోయే డైలాగ్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ జనరేషన్ ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది.

నాగ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో చాలా థియేటర్లలో ఆ సినిమాకు బదులుగా మన్మథుడు సినిమాను ప్రదర్శించారు.

విచిత్రం ఏంటంటే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా మన్మథుడు మూవీ రీ రిలీజ్ లో సైతం హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది.మొదట ఒకరోజు మాత్రమే ఈ సినిమాను ప్రదర్శించాలని భావించిన థియేటర్ల నిర్వాహకులు ఈ సినిమాకు వచ్చిన మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ను చూసి ఆశ్చర్యపోవడంతో పాటు మన్మథుడు సినిమాను థియేటర్లలో కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Manmadhudu Movie Re Release Effect On Gandeevadhari Arjuna Details, Manmadhudu M

తిరుపతి( Tirupati ) లాంటి చిన్న టౌన్ లలో సైతం ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో మన్మథుడు ఆశ్చర్యపరుస్తోంది.మరోవైపు వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున( Gandeevadhari Arjuna ) ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.సరైన ప్రమోషన్స్ చేయకపోవడమే ఈ సినిమాకు మైనస్ అయింది.

Advertisement
Manmadhudu Movie Re Release Effect On Gandeevadhari Arjuna Details, Manmadhudu M

వరుణ్ తేజ్( Varun Tej ) చాలా సందర్భాల్లో గాండీవదారి అర్జున మూవీ అద్భుతంగా ఉండనుందని చెప్పుకొచ్చారు.

Manmadhudu Movie Re Release Effect On Gandeevadhari Arjuna Details, Manmadhudu M

అయితే ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది.మన్మథుడు రీ రిలీజ్ దెబ్బకు వరుణ్ తేజ్ మూవీకి థియేటర్లు సైతం కరువయ్యాయి.యంగ్ జనరేషన్ మెగా హీరోలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.

వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా( Matka Movie ) అనే సినిమాలో నటిస్తున్నారు.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు