మంచు విష్ణుకి విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసన సెగ

తెలుగు ప్రజలు ఆత్మాభిమాన హక్కుగా భావించే విశాఖ ఉక్కుని కేంద్రంలో మోడీ సర్కార్ ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

ఎవరు ఎన్ని చేసిన ప్రైవేట్ పరం చేయడం పక్కా అనే విధంగా కేంద్ర మంత్రులు తేల్చి చెప్పేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ తో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, అది కేంద్ర ప్రభుత్వంలోని అంశం అని తేల్చి చెప్పేసి ప్రైవేటైజేషన్ చేయడం లేదంటే మూసేయడం ఏదో ఒకటి జరుగుతుందని క్లారిటీ మంత్రులు కరాఖండీగా చెప్పేశారు.దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ఉత్తరాంద్ర ప్రజలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు.

ఇప్పటికే యాజమాన్యంకి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు కూడా ఇచ్చాయి.ప్రైవేటైజేషన్ చేస్తే సహించేది లేదని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

దీనికోసం ఎంత వరకైనా వెళ్తామని నాయకులు అంటున్నారు.ఇదిలా ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమ సెగ సినీ నటులకి కూడా తగులుతుంది.

Advertisement

తాజాగా సినీ నటుడు మంచు విష్ణుకు స్టీల్ ప్లాంట్ సెగ తగిలింది.తన తాజా చిత్రం మోసగాళ్లు ప్రమోషన్ కోసం తన టీమ్ తో కలిసి విష్ణు వైజాగ్ కు వెళ్లారు.

ఈ సందర్భంగా విష్ణును ఉద్యమకారులు అడ్డుకున్నారు.ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వినతిపత్రాన్ని అందజేశారు.

విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని, లేకపోతే వైజాగ్ కు సినీ ప్రముఖులు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు హెచ్చరించారు.ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీలు ప్లాంటును లాభాల్లో నడుపుతామని చెపుతున్నప్పుడు, ఆ పని ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.

ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని సినీ ప్రముఖులకు ఉందని, కానీ, రాజకీయ కారణాలతో ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు.సినీ పెద్దలు దీనిపై తీసుకునే నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు.మిగిలిన సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై ఎలా రెస్పాండ్ అవుతారనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు