ప్రభాస్ ఆ మాట చెబితే నేనీ సినిమా చేసేవాడిని కాదు.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్!

మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన కన్నప్ప ( Kannappa ) సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉంది.

ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఒకింత భారీ బడ్జెట్ తోనే కన్నప్ప సినిమా తెరకెక్కగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ కు చేరుకుంటుందో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మంచు విష్ణు మాట్లాడుతూ నేను ఆంజనేయ స్వామి భక్తుడినని ఈ సినిమా షూట్ మొదలైనప్పటి నుంచి నా లైఫ్ ఎంతో ప్రశాంతంగా ఉందని వెల్లడించారు.

ఇదంతా శివలీలే అని అనిపిస్తోందని విష్ణు పేర్కొన్నారు.ఈ సినిమా వల్ల ఒక వ్యక్తిగా నేను ఎంతో మారానని ఆయన చెప్పుకొచ్చారు.

నటుడిగా కన్నప్ప ముందు కన్నప్ప తర్వాత అనే విధంగా నా లైఫ్ ఉందని మంచు విష్ణు కామెంట్లు చేశారు.

Manchu Vishnu Comments Goes Viral In Social Media Details, Manchu Vishnu, Kannap
Advertisement
Manchu Vishnu Comments Goes Viral In Social Media Details, Manchu Vishnu, Kannap

కన్నప్ప సినిమా నాకో బేబీలాంటిదని తిన్నడు కథతో ఈ సినిమా తెరకెక్కిందని అయన తెలిపారు.కన్నప్పపై ప్రభాస్( Prabhas ) సినిమా చేస్తానని చెప్పి ఉంటే తాను ఈ ప్రాజెక్ట్ చేసేవాడిని కాదని విష్ణు వెల్లడించారు.కన్నప్పలో లింగం గురించి వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ తెలుసుకోకుండా విమర్శలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

Manchu Vishnu Comments Goes Viral In Social Media Details, Manchu Vishnu, Kannap

ఈ సినిమాలో మేము చూపించిన లింగాకారమే దేవాలయంలో కూడా ఉందని మంచు విష్ణు వెల్లడించారు.అక్కడ స్వామివారి లింగాన్ని ఒక ఆర్టిస్ట్ కొన్ని రోజుల పాటు శ్రమించి అక్కడి పూజారులతో మాట్లాడి డిజైన్ చేశారని విష్ణు తెలిపారు.మంచు విష్ణు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కన్నప్ప సినిమా 200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.

ఉగాది పూజలో మెరిసిన చిరంజీవి మనవరాలు.. వైరల్ అవుతున్న క్లీంకార ఫోటోలు!
Advertisement

తాజా వార్తలు