దోస పంట సాగులో బోరాన్ లోపం నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు..!

తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న తీగజాతి కూరగాయలలో దోస పంట( Cucumber Crop ) కూడా ఒకటి.

ఈ పంట సాగులో ఏవైనా పోషక సమస్యలు ఉన్నప్పటికీ మంచి దిగుబడులు సాధించవచ్చు కానీ బోరాన్ లోపం( Boron Deficiency ) ఉంటే మాత్రం సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

ముఖ్యంగా పంట పూత, పిందె దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం సంభవించే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ.కాబట్టి రైతులు సరైన సమయంలో బోరాన్ లోపం గుర్తించి యాజమాన్య పద్ధతులు చేపట్టి లోపాన్ని నివారిస్తేనే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించవచ్చు అని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ దోస పంటకు వేసవికాలం( Summer ) మినహా అన్ని కాలాలు సాగుకు అనుకూలంగానే ఉంటాయి.ఇక ఎలాంటి నేలలలోనైనా ఈ పంటను సాగు చేయవచ్చు.రైతులు అధికమవుతాదులో రసాయన ఎరువులు మాత్రం అందిస్తూ, సూక్ష్మ పోషకాల ను నిర్లక్ష్యం చేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి.

దీంతో బోరాన్ లోపం ఏర్పడి పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు కూడా పూర్తిగా దెబ్బతింటాయి.ముఖ్యంగా దోస విత్తనాలు( Cucumber Seeds ) మొలకెత్తిన తర్వాత మొక్కకు నాలుగు లేదా ఐదు ఆకులు ఉన్న దశలో బోరాన్ లోపం కనిపించే అవకాశం చాలా ఎక్కువ.

Advertisement

ఈ సమయంలో రైతులు బోరాన్ లోప నివారణ చర్యలు చేపట్టాలి.మరి ఈ పంట సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే, అందించాల్సిన ఎరువులు ఏమిటో తెలుసుకుందాం.ఒక ఎకరాకు 2.5 కిలోల యూరియా, 2కిలోల పొటాష్ ఎరువులను 15 విడతలుగా 45 రోజుల వరకు వేయాలి.ఆ తర్వాత రెండు కిలోల యూరియా, మూడు కిలోల పొటాష్ ఎరువును నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి.పంట పూత దశలో ఉన్నప్పుడు ఒక లీటరు నీటిలో 0.5 మిల్లీలీటర్ల స్కోర్ ను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు రెండు లేదా మూడుసార్లు పిచికారి చేస్తే మంచి దిగుబడి పొందవచ్చు.

ఈ నెల 9 నుంచి అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం!
Advertisement

తాజా వార్తలు