సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణకు( Telangana ) కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టోను ప్రకటించింది.
ఈ మేరకు విభజన సమయంలో ఏపీలోకి వెళ్లిన భద్రాచలం( Bhadrachalam ) చుట్టుపక్కల ఐదు గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతామని హామీ ఇచ్చింది.కాగా రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు మండలాలు( Polavaram Flood Zones ) ఏపీలో కలిసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్న, కన్నాయిగూడెం మరియు పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని తెలిపింది.అదేవిధంగా హైదరాబాద్ లో( Hyderabad ) ఐటీ ఐఆర్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించడంతో పాటు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది.
ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.







