హై-వోల్టేజ్ ఎలక్ట్రిక్ కేబుల్ పట్టుకున్న వ్యక్తి.. నెక్స్ట్ ఏం జరిగిందో చూస్తే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.

అందులో ఒక వ్యక్తి హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ కేబుల్‌ను( High Voltage Electric Cable ) పట్టుకోవడం మనం చూడవచ్చు.

ఆ సమయంలో అతడు చేతికి ఏదో గ్లోవ్స్( Gloves ) పెట్టుకున్నాడు.అవి ప్రొటెక్టివ్ హ్యాండ్ గేర్ అయి ఉండొచ్చు.

అయినా కూడా హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ వైర్లు పట్టుకోవడం చాలా ప్రమాదకరమైనది.పొరపాటున ఒక చిన్న రంధ్రం నుంచి షాక్ తగిలినా సరే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోయే ప్రమాదం ఉంది.

ఈ వైరల్ వీడియోను @ScienceGuys_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది దీనికి ఇప్పటికే 47 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

Advertisement

ఈ వీడియో ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి ఎలక్ట్రిక్ వైర్ పట్టుకొని తర్వాత దాని వదిలేశాడు.వదిలేశాక తన చేతిని వైర్ కి కాస్త దూరంలో ఉంటాడు అప్పుడు ఏవో షాక్‌ వేవ్స్( Shock Waves ) లాంటి కణాలు కనిపించడం మనం చూడవచ్చు.చూసేందుకు చాలా భయానకంగా అనిపించింది.

చాలా ఎత్తులో పోల్ పై ఉన్న ఈ ఎలక్ట్రిక వైరు సదరు వ్యక్తి పట్టుకున్నట్లు కూడా అర్థమయింది.

సాధారణంగా ఎలక్ట్రిసిటీ మానవ శరీరం గుండా చాలా తేలికగా ప్రయాణిస్తుంది.తక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ షాక్ తగిలినా తీవ్రమైన గాయం లేదా మరణం సంభవించే ప్రమాదం ఉంది.అదే అధిక వోల్టేజ్ విద్యుత్ లైన్‌ను తాకినట్లయితే, కన్ను మూసి తెరిచేలోపు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, కండరాలు బిగుసుకు పోవచ్చు, రక్తం ఉడికిపోవచ్చు.

మొత్తం మీద ప్రాణాలు పోయేంత పెద్ద గాయం లేదా ప్రాణాలే పోవచ్చు.అధిక వోల్టేజ్ విద్యుత్ లైన్‌తో పరిచయం ఉన్నవారిని చూసినట్లయితే, వారికి మీరే సహాయం చేయడానికి ప్రయత్నించవద్దు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
ఓరి దేవుడా . . వీరికి ఇదేం పోయేకాలం.. నడిరోడ్డుపై అలా..

ఎమర్జెన్సీ సర్వీసులకు వెంటనే కాల్ చేయాలి, ప్రాంతం నుంచి దూరంగా ఉండాలి.

Advertisement

తాజా వార్తలు