మామూలుగా ముస్లిం మతానికి చెందిన మహిళలు బురఖాను సాంప్రదాయబద్దంగా ధరిస్తుంటారు.కానీ ఈ మధ్య కాలంలో కొందరు మహిళలు బయటకు వచ్చే సమయంలో కాలుష్యం, దుమ్ము, ధూళి, వంటి వాటి నుంచి రక్షణ కోసం ధరిస్తూ బయటకి వస్తుంరుటా.
అయితే తాజాగా ఓ వ్యక్తి విమానంలో ప్రయాణించడానికి బురఖా ధరించి మోసం చేసినందుకు గాను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
పూర్తి వివరాల్లోకి వెళితే ఇండోనేషియా దేశంలోను జకార్తా పరిసర ప్రాంతంలో జాన్ అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో నివాసముంటున్నాడు.
అయితే ఇటీవలే జాన్ కి కరోనా వైరస్ సోకడంతో ప్రభుత్వ అధికారులు 14 రోజుల పాటు క్వారెంటైన్ లో ఉండాలని సూచించారు.కానీ జాన్ కి అర్జెంటు పని పడటంతో ఇదే దేశంలో ఉన్నటువంటి “తిర్నెట్” ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది.
కానీ కరోనా వైరస్ సోకిన వారు ఇంటి నుంచి బయటికి రావడానికి వీలు లేదు.దీంతో జాన్ అతితెలివి ప్రదర్శించాడు.
ఈ క్రమంలో తన భార్య బురఖా దుస్తులను ధరించదమే కాకుండా ఆమె పాస్ పోర్టు ని ఉపయోగించి విమానయానం చేశాడు.అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.
కానీ విమానంలో ప్రయాణించేటప్పుడు జాన్ జెంట్స్ టాయిలెట్ కి వెళ్లడంతో అధికారులకి అనుమానం కలిగింది.దాంతో జాన్ విమానం దిగగానే పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అంతేగాక తన భార్య పాస్ పోర్ట్ ఉపయోగించి ప్రయాణించినందుకు అలాగే బురఖా ధరించి మహిళ అని ఎయిర్ పోర్ట్ అధికారులను మోసం చేసినందుకు కటకటాల్లోకి నెట్టారు.
దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అంతేకాకుండా ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతుంటే ప్రజలు మాత్రం కోవిడ్ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అందువల్లనే రోజురోజుకీ కరుణ వైరస్ ప్రభావం పెరుగుతుందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.