కూడవెల్లి ద్వారా మల్లన్న సాగర్ నీటిని విడుదల చేయాలి

ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేసిన ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎగువమానేరులో నీటిమట్టం తగ్గినందున కూడవెల్లి ద్వారా మల్లన్న సాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ సమీక్ష సమావేశానికి శుక్రవారం విచ్ఛేసిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసు తో వారు మాట్లాడారు ఎగువ మానేరు జలాశయం కింద గంభీరావుపేట,ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మూడు మండలాలకు చెందిన రైతులు యాసంగి వరి పంటలు సాగు చేసుకున్నారని ఎగువ మానేరు నీటిమట్టం తగ్గినందున చివరి వరకు పంటలకు నీరు అందే అవకాశం లేదని నీటి పారుదల శాఖ అధికారులు ముస్తాబాద్ మండలం పోతుగల్ డి 18 కాలువ వరకు తైబంది నిర్ణయించినారని , ఇక్కడ రైతులు తెర్లుమద్ది డి 21/22 నీటిని విడుదల చేసినట్టు అయితే రైతులు వేసిన వరి పంటలు చేతికి వస్తాయిని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కూడా వెళ్లి ద్వారా మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసినట్లయితే ఎగువ మానేరు జలాశయం నిండి దాని కింది ఉన్న చెరువులు కుంటలు నింపినట్లైతే పంటలు చేతికి వస్తాయని ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి ముఖ్యమంత్రి , నీటిపారుదల శాఖ మంత్రి తో మాట్లాడి నీటి విడుదల కు కృషి చేయాలని ఆది శ్రీనివాస్ కు ఇచ్చిన వినతి పత్రం లో కోరారు.

అక్కడ ఎగువ మానేరు జల సాధన పోరాట సమితి కన్వీనర్ , ముస్తాబాద్ మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి , జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్ది గారి శ్రీనివాసు , బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తుపాకుల శ్రీనివాస్ గౌడ్ , ముస్తాబాద్ సింగల్ విండో డైరెక్టర్ మిరుదొడ్డి దేవేందర్ తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News