హెయిర్ డై వాడకుండనే.. తెల్లజుట్టును నల్లగా ఎలా మార్చొచ్చంటే..?!

మనిషిలో నల్ల జుట్టు కాస్త తెల్ల జుట్టు కావడం అనేది సహజమైన ప్రక్రియ.

ఇదివరకు కాలంలో మనిషికి తెల్ల జుట్టు రావాలంటే 50 ఏళ్లు దాటాక సమయం పట్టేది.

అదే ఈ రోజుల్లో అనేక మంది యువతలో కూడా తెల్ల జుట్టు రావడం మొదలైపోయింది.అయితే ఈ సమస్యకు గల ముఖ్యమైన కారణం మన శరీరంలో మెలనిన్ అనే పదార్థం సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం.

ఇకపోతే తెల్ల జుట్టు రంగును మరింతగా మెరుగుపరచడానికి నల్లగా మిరుమిట్లు గొలపడానికి వ్యాపార రంగంలో రకరకాల హెయిర్ కండిషనర్ లు, హెయిర్ డైలు అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి.అయితే ఇది జుట్టుకు నామమాత్రపు పరిష్కారం చూపించిన మొత్తానికి మాత్రం హాని కలిగిస్తాయి.

అయితే తెల్లజుట్టుకు సరైన పరిష్కారమే లేదా అని భావిస్తున్నారా.? అలాంటి వారికి సహజంగా నల్లగా కురులు మారాలంటే ఇలా ఫాలో అవ్వాల్సిందే.బంగాళాదుంపల్ని మనం వండుకునే ముందు దానిపై ఉన్న తోలును తీసేసి పడేయడం సర్వసాధారణం.

Advertisement

అయితే అలా తీసేసిన తోలులో అధికంగా పిండి పదార్థాలు ఉంటాయని చాలా మందికి తెలియదు.ఈ పిండి పదార్థాలు జుట్టుకు మంచి పోషణగా పనిచేస్తుంది.బంగాళాదుంపలు పై ఉన్న తొక్కును తీసుకొని వాటిని రెండు కప్పుల నీటిలో ఉడకబెట్టి ఆ తర్వాత పూర్తిగా చల్లారాక అరగంట పాటు తలకు మర్దనా చేసి ఒక గంట పాటు వదిలేయాలి.

అలా చేసిన తర్వాత చల్లని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం ద్వారా జుట్టు ఒత్తుగా అవడమే కాకుండా రాలిపోకుండా, తెల్ల జుట్టు కాస్త నల్లగా మారడానికి పరిష్కారం చూపిస్తుంది.

ఇక తెల్లజుట్టును నల్లగా చూపించే విజయవంతమైనది  ఏదైనా ఉందంటే.అది కాఫీ పౌడర్.బాగా ముదురు రంగులో ఉండే కాఫీ పౌడర్ ను తీసుకొని అందులో ఎలాంటి వాటిని కలపకుండా కొద్దిపాటి నీటిలో కాఫీ పౌడర్ ని వేసుకొని ఓ మిశ్రమంగా తయారు చేసుకోవాలి.దానిని సన్నని మంటపై మరిగించాలి.

అలా మరిగించిన పదార్థాన్ని చల్లార్చి ఆ తర్వాత తలకు 45 నిమిషాల పాటు పెట్టుకొని కడిగేస్తే ఈ తెల్ల వెంట్రుకలు కాస్త నల్లబడడానికి పోషణ లభిస్తుంది.అలాగే మరో విధానం ఏమిటంటే కొబ్బరినూనెలో కాస్త ఉసిరి పొడి కలుపుకొని దానిని వేడి చేసి మరిగించి చల్లార్చిన తర్వాత ప్రతి రోజూ ఆ మిశ్రమాన్ని పది నుంచి పదిహేను నిమిషాల వరకు మర్దన చేసి ఉంచుకున్నట్లయితే జుట్టు నల్లగా మారేందుకు సహాయపడుతాయి.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఇలా సహజమైన పద్ధతిలో తెల్లటి వెంట్రుకలను కాస్త నల్లటి వెంట్రుకలగా మార్చుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు