ఎండాకాలం( Summer ) కావడంతో భానుడు భగ్గుమంటున్నారు.చాలాచోట్ల వడదెబ్బ తగిలి మనుషులు మృత్యువాత పడిన ఘటనలు మనం చూస్తూ వున్నాం.
ఇక చాలా చోట్ల ఏసీ లేనిదే గడవని పరిస్థితి కూడా మనం గమనించవచ్చు.అయితే అందరూ ఏసీలు ( AC ) కొనలేరు కదా.ఈ క్రమంలోనే కొంతమంది తమ మెదడుకి పని చెబుతున్నారు.అవును, ఎండ నుంచి ఉపశమనం పొందడానికి డబ్బున్నవాళ్ళు ఏసీలు కొని తెచ్చుకుంటుంటే మధ్యతరగతి వారు కూలర్లతో సరిపెట్టుకుంటున్నారు.మరి పేదవాళ్ల పరిస్థితి ఏమిటి?
పోనీ కూలర్ కొందామన్నా ఇపుడు దానికి కూడా డిమాండ్ పెరిగిపోయింది.డిమాండ్ ఉండడంతో కూలర్ల రేట్లు అంతకంతకు పెరిగిపోయాయి.ఈ క్రమంలోనే కొందరు ఔత్సాహికులు ప్రత్యామ్నాయ వర్గాల కోసం ఆలోచిస్తున్నారు.వేల రూపాయలు పెట్టి కూలర్ ని కొనాల్సిన అవసరం లేదు… చిన్న ఆలోచన చేస్తే చాలు అని వారి ఐడియాలు చూస్తేనే మనకు అర్ధం అవుతుంది.
కేవలం జేబులో ఓ పది రూపాయిలు ఉంటే హోం మేడ్ ఏసిని( Home Made AC ) తయారు చేసుకోవచ్చు అని తాజాగా ఒక వ్యక్తి నిరూపించాడు.
ఆ వ్యక్తి కేవలం రు.10ల ఖర్చుతో ఓ పాడుపడిపోయిన పాత కూలర్ తో ఏసీని తయారు చేసుకున్నాడు.కాగా దానికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోని ఒకసారి గమనిస్తే, అతను కొన్ని పగిలిన కుండలను దానికోసం వాడడం మనం గమనించవచ్చు.కుండలను పగలగొట్టి ఆ పెంకులను పాడైపోయిన పాత కూలర్ అడుగున వేసిన తర్వాత ఒక కుండను కూలర్ మధ్యలో పెట్టి దానిలో ఒక పైప్ పెట్టి దాని ద్వారా నీటిని పంపుతున్నాడు.
అందులోనే మరో పైప్ ద్వారా కూలర్ చుట్టూ ఉన్నగడ్డి తడిచేలా చేస్తున్నాడు.ఇంకేముంది తర్వాత కూలర్ ఆన్ చేస్తే పది రూపాయల ఖర్చుతో హోం మేడ్ ఏసీ తయారైపోయింది.