మే 7న హైదరాబాద్ బీఎస్పీ సభను విజయవంతం చేయండి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు,నియామకాలు ప్రజలకు దక్కుతాయని ఆశించి,సబ్బండ వర్గాలు కొట్లాడి సాధించిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ అన్నారు.

శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలో బీఎస్పి మండల కన్వీనర్ అమరవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మే 7న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి హాజరుకానున్న నేపథ్యంలో బహుజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి అందరికంటే ముందుగా 32 మంది బీఎస్పీ ఎంపీలతో మాయావతి మద్దతు తెలియజేశారని గుర్తు చేశారు.బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బహుజన రాజ్యాధికారం కోసం ప్రతీ ఒక్కరూ కలిసి రావాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దపంగ ఉపేందర్, అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి,నేరేడుచర్ల మండల అధ్యక్షులు తకెళ్ళ నాగార్జున, పెద్దపంగ సురేష్ బాబు, ప్రెమ్ కుమార్,బొజ్జా పవన్,పిట్టా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!
Advertisement

Latest Suryapet News