కోలీవుడ్ హీరోల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో శివకార్తికేయన్ ( Sivakarthikeyan ) .ఈయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అనే చెప్పాలి.
ఈయన సినిమాలతో ఇక్కడ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.ఇప్పుడు ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఈ ఏడాది లోనే రెండు సినిమాల రిలీజ్ లతో శివకార్తికేయన్ రెడీ అవుతున్నాడు.మరో పక్క కొత్త సినిమా లాంచ్ చేసాడు.ఈ రోజు ఈయన కొత్త సినిమా చెన్నైలో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.#SK21 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

అందుకే ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సాయి పల్లవి ( Sai Pallavi ) ఫ్యాన్స్ కు అయితే ఈ సినిమా కోసం ఖుషీ ఖుషీగా ఉన్నారు.లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు.ఎప్పటి నుండో కమల్ హాసన్ ( Kamal Haasan ) , శివ కార్తికేయన్ కాంబోలో ఒక సినిమా నిర్మితం కానున్నట్టు కోలీవుడ్( Kollywood ) లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా ఈ రోజు చెన్నైలో అట్టహాసంగా లాంచ్ అయ్యింది.డైరెక్టర్ రాజ్ కుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసారు మేకర్స్.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.సాయి పల్లవి, శివ కార్తికేయన్, కమల్ హాసన్ వంటి వారు పాల్గొన్నారు.
ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాకు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.







