త్రివిక్రమ్ కొత్త ఆలోచన.. మహేష్ సినిమాలో ఆ సీనియర్ నటి!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB28.మహేష్ గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో థియేటర్స్ లో సందడి చేసాడు.

ఈ సినిమాతో మహేష్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఈయన మరో సినిమా పూర్తి చేయలేదు.

కొత్త సినిమాను వెంటనే స్టార్ట్ చేసినప్పటికీ షూట్ అయితే ఎప్పటికప్పుడు డిలే అవుతూనే వచ్చింది.అయితే సంక్రాంతి తర్వాత ఎట్టకేలకు షూట్ స్టార్ట్ అయ్యింది.

దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.మహేష్ కూడా ఈ గ్యాప్ ను పూర్తి చేయాలని గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తూ కష్ట పడుతున్నాడు.

Advertisement
Mahesh Babu Trivikram Movie Latest Update, Mahesh Babu, SSMB28, Trivikram Sriniv

దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబో రిపీట్ కాబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Mahesh Babu Trivikram Movie Latest Update, Mahesh Babu, Ssmb28, Trivikram Sriniv

ఇదిలా ఉండగా ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఒక కీలక రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ నటి రేఖను తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట.

ఈ పాత్రకు ఈమె అయితేనే సరైన న్యాయం చేస్తుందని ఆయన భావిస్తున్నారట.మరి రేఖ ఈ పాత్రకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Mahesh Babu Trivikram Movie Latest Update, Mahesh Babu, Ssmb28, Trivikram Sriniv

ఈమె ఒప్పుకుంటే బాలీవుడ్ లో మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది.ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో జగపతిబాబు కూడా కీ రోల్ లో నటిస్తున్నాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు