సర్కారు వారి పాట సినిమాకు మహేష్ బాబు రెమ్యునరేషన్ అంత తక్కువా?

గత కొన్నేళ్లలో పెద్ద సినిమాల బడ్జెట్లు అంచనాలకు అందని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.

సినిమాల బడ్జెట్లు పెరగడం వల్ల నిర్మాతలకు గతంతో పోలిస్తే లాభాలు తగ్గుతున్నాయి.

అదే సమయంలో మరి కొందరు స్టార్ హీరోలు సైతం రెమ్యునరేషన్లను పెంచడం నిర్మాతలకు అదనపు భారంగా మారుతోంది.అయితే సర్కారు వారి పాట సినిమాకు మహేష్ బాబు తక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా తీసుకోవడం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమాకు దర్శకుడు పరశురామ్ 10 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకోగా మహేష్ బాబు 35 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం.సర్కారు వారి పాట సినిమాకు భారీ లాభాలు వస్తే మాత్రం లాభాల్లో కొంతమేర మహేష్ బాబు వాటాగా తీసుకోనున్నారని తెలుస్తోంది.

సర్కారు వారి పాట నిర్మాతలలో మహేష్ బాబు ఒకరు కావడంతో మహేష్ కు రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా దక్కుతోంది.

Advertisement

మరోవైపు సర్కారు వారి పాట చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచుతూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.ఈరోజు కూడా సర్కారు వారి పాట సినిమాకు బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి.రెండున్నరేళ్ల తర్వాత మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో పాటు సినిమా బాగానే ఉందని టాక్ ప్రచారంలోకి రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.

లేడీ ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.సర్కారు వారి పాట సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో లేడీ ఫ్యాన్స్ సందడి చేస్తుండగా ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే బీ, సీ సెంటర్లలో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.సర్కారు వారి పాట ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు