బాబోయ్ ఇక కష్టమే: సీబీఐ విషయంలో ఠాక్రే సంచలన నిర్ణయం!

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సీబీఐ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సుశాంత్ మృతి కేసును ముంబై పోలీసుల నుంచి సీబీఐ కి ట్రాన్స్ ఫర్ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 Maharashtra Blocks Cbi From Probing Cases In State Without Its Nod, Maharashtra-TeluguStop.com

అప్పటి నుంచి కూడా సీబీఐ పై గుర్రుగా ఉంటున్న మహా సర్కార్ ఇప్పుడు సమయం చూసి సీబీఐ పై కొన్ని కఠిన ఆంక్షలు విధించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పై మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఠాక్రే సర్కార్ నిర్ణయం తీసుకుంది.

మహా సర్కార్ విధించిన కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇకపై సీబీఐ అధికారులు మహారాష్ట్రలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్న ముందుగా అక్కడి ప్రభుత్వ అనుమతిని తీసుకోవాలని, అలాగే వారు దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సైతం ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖకు తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుందట.దీనికి సంబందించిన తాజా ఉత్తర్వులను మహాసర్కార్ బుధవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

సర్కార్ విధించిన ఆంక్షలకు అనుగుణంగా సీబీఐ అధికారులు వ్యవహరించాల్సి ఉంటుంది.గతంలో లాగా కేంద్ర సర్కార్ ఆదేశాలతో అక్కడ కేసుల విచారణ జరగాలి అంటే ఇక కుదరదు అన్నమాట.

ఆ కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత.హోం మంత్రిత్వ శాఖ అధికారులు అనుమతి ఇస్తేనే సీబీఐ అధికారులు ఆ కేసు దర్యాప్తు అనేది చేయాలి అన్నమాట.

గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజధాని ముంబై సంచలన కేసులకు కేంద్రబిందువు అవుతోంది.

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా కేసు విచారణ జరుగుతుండగా తాజాగా టీఆర్పీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసును కూడా సీబీఐ విచారించాలని ప్రజల నుండి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో నే మహా సర్కార్ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకొని సీబీఐ పై ఆంక్షలు విధించడం గమనార్హం.మరి దీనిపై కేంద్ర సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube