మహా శివరాత్రి రోజున తాజ్‌మహల్‌లో శివలింగం ప్రత్యక్షం.. వీడియో చూస్తే షాకే..

మహా శివరాత్రి( Maha Shivaratri ) రోజున ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌లో( Taj Mahal ) ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది.

మీరా రాథౌర్( Meera Rathaur ) అనే మహిళ తాజ్‌మహల్ లోపలికి శివలింగాన్ని( Shivling ) తీసుకెళ్లి పూజలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆమె ఏకంగా గంగాజలాన్ని శివలింగంపై పోసి హల్ చల్ చేసింది.తాను ఆ గంగాజలాన్ని మహా కుంభమేళా ముగిసిన ప్రయాగ్‌రాజ్ నుంచి తెచ్చానని చెప్పడం విశేషం.

Maha Shivratri 2025 Woman Performs Shivling Abhishek Inside Taj Mahal Video Vira

మీరా రాథౌర్ ఎవరో కాదు మహిళా నేతృత్వంలోని ఓ హిందూ సంస్థకు లీడర్ అని తెలుస్తోంది.తాజ్‌మహల్ లోపల ఓ మూలన శివలింగాన్ని పెట్టి ప్రత్యేక పూజలు చేసిందామె.అంతేకాదు, తాజ్‌మహల్ అసలు తాజ్‌మహల్ కాదని, అది తేజో మహల్ అని ఆమె వాదించడం మరింత కలకలం రేపుతోంది.

అయితే, ఈ వీడియో నిజమైనదా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది.ఇది ఎప్పుడు రికార్డ్ చేశారో కూడా తెలియదు.మాతో సహా ఇతర వార్తా సంస్థలు సైతం ఈ వీడియోని వెరిఫై చేయలేకపోయాయి.

Advertisement
Maha Shivratri 2025 Woman Performs Shivling Abhishek Inside Taj Mahal Video Vira

ఈ వీడియో మీరు కూడా చూసేయండి.

Maha Shivratri 2025 Woman Performs Shivling Abhishek Inside Taj Mahal Video Vira

మరోవైపు దేశమంతా మహా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి.ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా( Maha Kumbhmela ) చివరి రోజు కావడంతో లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.వారణాసిలో అయితే మహా శివరాత్రి శోభ వెల్లివిరిసింది.

నాగా సాధువులు, వివిధ అఖాడాల సభ్యులు కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు.శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించారు.

మహామండలేశ్వర్‌లు రాజఠీవిగా రథాలపై ఊరేగుతూ కనిపించారు."హర్ హర్ మహాదేవ్" అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.

తీహార్‌లోని మగ ఖైదీల బ్లాక్‌లో యువతి.. కళ్లారా ఏం చూసిందంటే?
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

భక్తులు త్రిశూలాలు, గదలు, కత్తులు పట్టుకుని జలాభిషేకం చేస్తూ శివుడిని కొలిచారు.

Advertisement

తాజా వార్తలు