టాలీవుడ్ లో 'లైకా' పాగా వేయబోతుందా.. ఇదే జరిగితే..

మన టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి.

అందులో టాప్ నిర్మాణ సంస్థలు స్టార్ హీరోలతో పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ భారీ బడ్జెట్ ను పెడుతున్నారు.

దీంతో సౌత్ లోనే మన టాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అని తెలుస్తుంది.

ఆ సంస్థ మరేంటో కాదు.కోలీవుడ్ (Kollywood) లో బడా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions).

ప్రస్తుతం లైకా మాత్రమే కోలీవుడ్ లో బడా సినిమాలను నిర్మిస్తున్నారు.ఈ సంస్థ వారు ఎంత బడ్జెట్ కు అయిన వెనుకాడకుండా పెట్టుబడి పెడుతుంటారు.

Advertisement
Lyca Productions Grand Entry In Tollywood, Tollywood, Lyca Productions, Tollywoo

అందుకే కోలీవుడ్ హీరోలు ఈ నిర్మాణ సంస్థలో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.ఈ సంస్థ హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను నిర్మిస్తూ పోతున్నారు.

Lyca Productions Grand Entry In Tollywood, Tollywood, Lyca Productions, Tollywoo

తమిళ్ లో 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న ఏకైన నిర్మాణ సంస్థ లైకా మాత్రమే.ఈ సంస్థ అంటే భారీ స్థాయిలో ఉండాల్సిందే అనే ఒక గుర్తింపు తెచ్చుకుంది.స్టార్ హీరో సినిమాకు ఎంత బడ్జెట్ కావాలో అంతకు మించి మరీ సినిమాలు చేస్తున్నారు.

అయితే లైకా తమ నిర్మాణ సంస్థను విస్తరించాలని చూస్తుందట.అందులో భాగంగానే ఈ సంస్థ ముందుగా తెలుగు (Tollywood) మీద ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

Lyca Productions Grand Entry In Tollywood, Tollywood, Lyca Productions, Tollywoo

తెలుగులో అతి త్వరలోనే స్టార్ హీరోతో ఒక భారీ సినిమాను ప్రకటించే ప్లాన్ లో ఈ సంస్థ ఉందట.ఇప్పటికే మన హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.మరి అలాంటి సమయంలో లైకా కూడా అడుగు పెడితే మరోలా ఉంటుంది అనే టాక్ వస్తుంది.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

వీరికి దిల్ రాజు అండగా ఉండబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది.ఇప్పటికే ఇక్కడ హీరోలతో సంప్రదింపులు చేస్తున్నారట.మరి లైకాతో మొట్టమొదటిగా చేతులు కలిపే ఆ స్టార్ హీరో ఎవరో చూడాలి.

Advertisement

తాజా వార్తలు