అరటి పండ్లు కొంటే రూ.1.60 లక్షల బిల్లు వేశారు...

సాధారణంగా మనకు మార్కెట్లో విరివిరిగా దొరికేవాటిలో అరటిపండ్లు ఒకటి.వీటి ధర మారీ ఎక్కువగా కాకుండా.

సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రేట్లలోనే లభిస్తుంటాయి.అంటే ఒక డజను అరటి పండ్ల ధర దాదాపు ఒక 50 నుంచి 60 రూపాయాలు ఉంటుంది.

మరీ వాటి జాతిని బట్టి ధర కూడా మారుతుంటుంది.కానీ లక్షల్లో మాత్రం ఉండవు.కానీ ఓ మహిళకు మాత్రం అరటి పండ్లు తీసుకున్నందుకు ఏకంగా రూ.1.60 లక్షల బిల్లు వేశారు.అది చూడగానే ఆ మహిళకు దిమ్మతిరిగిపోయింది.

ఈ ఘటన లండన్‏లో చోటు చేసుకుంది.లండన్‏కు చెందిన ఓ మహిళ అక్కడి ఎంఎస్ దుకాణంలో అరటిపండ్లను కొనుగోలు చేసింది.

Advertisement

వాటితోపాటు కొన్ని పదార్థాలను కూడా కొనుగోలు చేసింది.అయితే ఆ స్టోర్ వాళ్లు అరటి పండ్లకు ఏకంగా 1600 ఫౌండ్లు అంటే దాదాపు రూ.1.60 లక్షల బిల్లు వేశారు.ఈ విషయం తెలియని ఆమె.తన యాపిల్ క్రెడిట్ కార్డుతో కాంటాక్ట్ లెస్ పద్ధతిలో బిట్టు కట్టింది.అయితే ఒక ఫౌండుకు బదులుగా 1600 ఫౌండ్ల బిల్ రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్‏కు గురయింది.

తన ఖాతాలో ఎంత అమౌంట్ కట్ అయ్యిందనే విషయం మొత్తం తనకు ఎస్ఎంఎస్ వచ్చింది.అప్పటికే ఆ స్టోర్ లో తన బిల్ కూడా ప్రింట్ వచ్చేసింది.

అది చూసాక తను వెంటనే స్టోర్ నిర్వహాకులను కలిసింది.తమ స్టోర్ మెయింటెనెన్స్‏లో చిన్న పొరపాటు జరిగిందని.

తమ కంపెనీకి చెందిన మరో స్టోర్ కొద్ది దూరంలో ఉందని.అక్కడికి వెళ్తే ఆ మొత్తం రీఫండ్ చేస్తారని అక్కడి వాళ్లు చెప్పారు.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
వీడియో వైరల్ : అసలు బుద్ది ఉందా లేదా.. రీల్స్ కోసం ఇలా అవసరమా..

దీంతో వెంటనే ఆమె ఆ స్టోర్ వైపు నడిచింది.ఇలా దాదాపు 45 నిమిషాల పాటు నడిచి.

Advertisement

ఇంకో స్టోర్‏కు చేరుకొని అక్కడి వాళ్లతో జరిగింది తెలిపింది.దీంతో వారు ఆమెకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేశారు.

స్టోర్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో వ‌చ్చిన సాంకేతిక స‌మ‌స్య కార‌ణంగానే 1 పౌండ్‌కు బ‌దులుగా 1600 పౌండ్ల బిల్ న‌మోదు అయింద‌ని స్టోర్ నిర్వాహ‌కులు వివ‌ర‌ణ ఇచ్చారు.ఏది ఏమైనా ఆ మ‌హిళ అల‌ర్ట్‌గా ఉండ‌బ‌ట్టి త‌న డ‌బ్బు త‌న‌కు తిరిగి పొందింది.

తాజా వార్తలు