శవ రాజకీయాలు అంటూ సీఎం జగన్ పై లోకేష్ సెటైర్లు..!!

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నాటు సారా తాగి చాలామంది మరణించడం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.

ఈ అంశంపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.కల్తీ సారా మరణాల విషయంలో శాసన మండలిలో ప్రభుత్వం ఎటువంటి చర్చ జరగకుండా పారి పోయింది అని మండిపడ్డారు.

Lokesh Satires On Cm Jagan , Jangareddygudem , Lokesh , Ys Jagan , Ap Politics

శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ సెటైర్లు వేశారు.తండ్రి శవం దొరక ముందే ముఖ్య మంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.ఇక ఇదే సమయంలో నాటుసారా తాగి మనకు తెలిసి 25 మంది చనిపోవడం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా.కల్తీ సారా తాగి ఎంత మంది చనిపోయారో అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement
Lokesh Satires On CM Jagan , Jangareddygudem , Lokesh , YS Jagan , AP Politics

ఇటువంటి మరణాలపై చర్చ జరపకుండా ప్రభుత్వం.ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా అంటూ వ్యాఖ్యానించారు.

అంత మాత్రమే కాక జంగారెడ్డి గూడెంలో మరణించిన వారి పోస్టు మార్టం రిపోర్టులు రాక ముందే మంత్రులు సహజ మరణాలు అని ఎలా తెలుస్తారు అని విమర్శించారు.కల్తీ సారా మరణాలు ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేపట్టాలనీ లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement
" autoplay>

తాజా వార్తలు