చైనాలో మళ్ళీ లాక్ డౌన్..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కేసులు నమోదు కావడంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు స్టార్ట్ అవుతున్నాయి.

గత కొద్ది నెలల నుండి చైనాలో చాలా ప్రాంతాలలో కరోనా విజృంభిస్తూ ఉంది.

దీంతో అక్కడి ప్రభుత్వం ఎక్కడికక్కడ లాక్ డౌన్ విధిస్తూ వైరస్ కంట్రోల్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ చైనాలో లాక్ డౌన్ విధించారు.

త్వరలో సెలవులు వస్తుండటం.ప్రజలు బయటకు తిరిగే అవకాశం ఉండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం చైనాలో 33 నగరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.సో దీని ప్రభావం ఆరున్నర కోట్ల మందిపై పడుతోంది.

Advertisement

చైనాలో 1500 కు పైగా కొత్త కేసులు నమోదు కాగా.సంఖ్య తక్కువే అయినా గాని చైనా ప్రభుత్వం మాత్రం చాలా అప్రమత్తంగా జీరో కోవిడ్ విధానం అమలు చేస్తుండటంతో లాక్ డౌన్, క్వారంటైన్ విధిస్తోంది.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు