జీవితం ఒక మిస్టరీ.. పూరీజగన్నాధ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు సినీ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.ఈయన గురించి, ఈయన దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు.

ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు పూరి.

ఇక పూరి గత కొన్ని రోజుల నుండి పూరి మ్యూజింగ్స్ అనే పేరు మీద కొన్ని విషయాలు పంచుకుంటున్నాడు పూరి జగన్నాథ్.ఇప్పటికే ఎన్నో విషయాలను పంచుకున్న పూరి తాజాగా జీవితం అనే కాన్సెప్ట్ గురించి వివరించాడు.

Advertisement

జీవితం అనేది ఓ మిస్టరీ అని జీవితం గురించి పరిశోధన చేయడం టైం వేస్ట్ పని అన్నాడు.ప్రతి ఒక్కరూ జీవితం గురించి, జీవితంలో ఉన్న అర్థం ఏమిటి అనే వాటికి సమాధానాల కోసం బాగా పరిశోధనలు చేస్తున్నారని తెలిపాడు.

ఇక వీటి గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు పూరి.వేల సంవత్సరాల నుండి గురువులు, బాబాలు మన చుట్టూ ఉండే వారని వాళ్లను ఎన్నో ప్రశ్నలు అడిగే వాళ్ళమని తెలిపాడు.కర్మఫలాన్ని నిర్ణయించేది.

అసలు మనిషికి పునర్జన్మ ఉందా లేదా అని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటామని.కానీ వాళ్లు ఇచ్చే సమాధానాలు రకరకాలుగా ఉంటాయి అని తెలిపాడు పూరి.

అందుకు మనం వేసే ప్రశ్నలతో వాళ్లని విసిగించడం తప్ప వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలిపాడు.అందుకే ఆ ప్రశ్నలను వాళ్లు తట్టుకోలేక మనందరినీ ఆశ్రమంలో చేర్చుకుంటారు ఆ తర్వాత యోగాలు, ధ్యానాలు వంటివి నేర్పిస్తుంటారు అని తెలిపాడు.అలా ధ్యానాలు చేయడం వల్ల ఆలోచించే శక్తి పెరుగుతుందని పిచ్చి ప్రశ్నలు రావని అందుకే సైలెంట్ గా ఉండిపోతామని తెలిపాడు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అందుకే లైఫ్ అనేది మిస్టరీ అని దాన్ని పరిశోధించడం అనేది టైం వేస్ట్ అనిఅందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని తెలిపాడు పూరిజగన్నాధ్.

Advertisement

తాజా వార్తలు