అంబేడ్కర్,పూలే బాటలో పయనిద్దాం:మంత్రి

సూర్యాపేట జిల్లా:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే బడుగు, బలహీన,దళిత వర్గాల ఇళ్లల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్య శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

ఆయన రాజ్యాంగం కేవలం కొన్ని వర్గాలకే పరిమితం కాకుండా అన్ని కుల,మత వర్గాల జీవితాలను సుఖమయం చేసుందని మంత్రి అభిప్రాయపడ్డారు.మాదిగల ఆత్మీయ సమ్మేళన చైర్మన్ చింతలపాటి చిన్న శ్రీరాములు అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలోని సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మాదిగల ఆత్మీయ సభకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.1947 కు ముందు పరాయి పాలనలో ఉన్న భారతదేశానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దిశానిర్దేశం చేయడంతో పాటు, మరోసారి దేశం పరాయి పాలనలో వెళ్లకుండా ఉండేందుకు మార్గం సుగమం చేసిందన్నారు.అంబేద్కర్ రాత్రింబవళ్లు అహర్నిశలు శ్రమించడం వల్లే దేశ ప్రజలు నేడు సుఖంగా ఉన్నారన్నారు.

Let's Walk In The Path Of Ambedkar And Poole: Minister-అంబేడ్క

పరాయి పాలనలో విద్యకు దూరమైన దళితులు ఆయన రచనల తోనే నేడు ఉద్యోగాలు పొందారని కితాబిచ్చారు.మనుధర్మం ప్రాచుర్యంలోకి వచ్చాక దళితులు ఆశించినంతగా లేరన్న విషయాన్ని ఆయన గమనంలో ఉందన్నారు.

అంబేద్కర్ రచనలు,పూలే పోరాటాల స్ఫూర్తిగా తీసుకునే నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు.అందులో భాగమే దళితబంధు అని వర్ణించారు.కేజీ టూ పీజీ విద్య ద్వారా దళిత,గిరిజనులకు విద్య దగ్గరకు అవుతుందని భావించిన సీఎం కేసీఆర్ అట్టి పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు చెప్పారు.

Advertisement

నియోజకవర్గ పరిధిలోని దళితులందరికి దళితబంధు దశల వారిగా వస్తుందని భరోసా కల్పించారు.కాస్త ఆలస్యం అయినంత మాత్రాన ఎవరూ కలత చెందాల్సిన పనిలేదన్నారు.

కొన్ని కారణాల వల్ల జిల్లా కేంద్రంలో నిలిచి పోయిన అంబేద్కర్ భవన నిర్మాణాన్ని మరో మూడు నెలలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమ్మేళన సభలో పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది భిక్షం,సూర్యాపేట జడ్పీటీసీ జీడీ భిక్షం,కౌన్సిలర్లు చింతలపాటి భరత్ మహాజన్,మామిడి గౌరయ్య, బచ్చలకూరి శ్రీనివాస్,వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు దున్న శ్యామ్,జాన్ విల్సన్,కందుకూరి సోమశేఖర్,వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఊట్కూరి సైదులు,ఆత్మకూరు(ఎస్)పిఏసీఎస్ వైస్ చైర్మన్ బొల్లే జానయ్య,మాజీ ఎంపిపి చందుపట్ల పద్మయ్య, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మొండికత్తి వెంకటేశ్వర్లు,నెమ్మాది నగేష్,ప్రజా సంఘాల నాయకులు యాతాకుల రాజయ్య,యాతాకుల సునీల్,రెబల్ శ్రీను,పిడమర్తి మల్లయ్య,నియోజకవర్గ నలుమూలల నుండి తరలి వచ్చిన పలువురు ప్రజా ప్రతినిధులు,ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News