యూకేలో జాబ్స్ లేక ఇండియాకు తిరుగుముఖం పడుతున్న విద్యార్థులు.. అందరిలోనూ కన్నీళ్లే!

యూకేలో( UK ) ఉంటున్న ఓ లెక్చరర్ తాజాగా బ్రిటన్‌లో భారతీయ విద్యార్థులు( Indian Students ) పడుతున్న కష్టాల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

సోషల్ మీడియా సైట్‌ రెడిట్‌లో @adamsan99 అనే పేరుతో అతను పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెద్ద దుమారమే రేపుతోంది.

తాను పాఠాలు చెప్పే యూనివర్సిటీలో ఏకంగా 80% మంది ఇండియా వాళ్లేనని, వాళ్ల పరిస్థితి చూస్తే బాధేస్తోందని అతను తన అనుభవాన్ని పంచుకున్నాడు.చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ ఏడాది MSc ప్రోగ్రామ్‌లలో చేరుతున్నారని, వాళ్ల లక్ష్యం ఎలాగైనా అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి, లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని ఆ లెక్చరర్( Lecturer ) చెప్పాడు.

కానీ చదువు మీద కన్నా.పూట గడవడం కోసం, ఖర్చుల కోసం చేసే పార్ట్‌టైమ్ జాబ్స్( Part Time Jobs ) మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని అతను ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇలా చేయడం వల్ల వాళ్ల స్కిల్స్ పెరగట్లేదని, చివరికి ఫుల్‌టైమ్ ఉద్యోగం సంపాదించే అవకాశాలు దారుణంగా తగ్గిపోతాయని వార్నింగ్ ఇచ్చాడు.

Lecturer Claims Indian Students In Uk Struggle To Find Jobs End Up Returning Hom
Advertisement
Lecturer Claims Indian Students In UK Struggle To Find Jobs End Up Returning Hom

"కేవలం UK డిగ్రీ ఉంటే సరిపోదు బాస్ ఉద్యోగం గ్యారెంటీ లేదు" అని కుండబద్దలు కొట్టాడు."కంపెనీలకు కావాల్సింది నైపుణ్యాలు, సబ్జెక్ట్ నాలెడ్జ్, స్ట్రాంగ్ ప్రొఫెషనల్ పోర్ట్‌ఫోలియో.కానీ చాలా మంది స్టూడెంట్స్ డబ్బు సంపాదన మీద పడి, ఇవి నేర్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు" అని తేల్చేశాడు.

చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్‌కి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ చాలా తక్కువని, క్లాసులో అస్సలు యాక్టివ్‌గా ఉండరని కూడా ఆ లెక్చరర్ చెప్పాడు.సిగ్గు, బిడియం ఎక్కువట.ఏదైనా తెలుసుకోవాలన్న ఆసక్తి అస్సలు ఉండదట.

ఇలాంటి లక్షణాలు UK జాబ్ మార్కెట్‌లో అస్సలు పనికిరావని, అక్కడ చురుగ్గా, దూసుకుపోయే వాళ్లకే కంపెనీలు పట్టం కడతాయని అన్నాడు."వాళ్లకు పాఠాలు చెప్పకముందు, ఇండియన్స్ చాలా తెలివైన వాళ్లు, కష్టపడతారని అనుకున్నా" అని అతను ఒప్పుకున్నాడు.

Lecturer Claims Indian Students In Uk Struggle To Find Jobs End Up Returning Hom

"కానీ నా స్టూడెంట్స్‌లో చాలా మంది క్లాసులో కలవరు, ఇచ్చిన పని పూర్తి చేయరు, సొంతంగా ఆలోచించరు (క్రిటికల్ థింకింగ్), సరిగ్గా మాట్లాడలేరు.ఇలా కాన్ఫిడెన్స్ లేకుండా, కొత్త పరిస్థితులకు అలవాటు పడలేకపోతే.వాళ్లకు ఉద్యోగాలు దొరకడం కష్టం.

స్టార్ హీరోయిన్ శ్రీలీలకు వరుస ఫ్లాపులు రావడం వెనుక కారణాలు ఇవేనా?
కజకిస్థాన్‌లో విషాదం.. భారత వైద్య విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం!

పాపం, చివరికి ఇండియాకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది." అని చెప్పడం అందరినీ కలచివేస్తోంది.

Advertisement

అలాగే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్.వాళ్ల ఇండియన్ ఫ్రెండ్స్‌తోనే తిరుగుతారు తప్ప, వేరే దేశాల వాళ్లతో, ప్రొఫెసర్లతో కలిసి విలువైన ప్రొఫెషనల్ పరిచయాలు (నెట్‌వర్కింగ్) పెంచుకోరని అతను గమనించాడట.

దీనివల్ల, వాళ్లలో చొరవ తక్కువ, కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ అనే అపోహలు (స్టీరియోటైప్స్) ఇంకా బలపడతాయని చెప్పాడు.ఈ లెక్చరర్ పోస్ట్‌కు 500కి పైగా అప్‌వోట్లు వచ్చాయి, పెద్ద చర్చే నడుస్తోంది.

కొంతమంది నెటిజన్లు లెక్చరర్‌తో ఏకీభవించారు.UKలో జాబ్ కొట్టాలంటే కమ్యూనికేషన్, పరిచయాలు చాలా ముఖ్యమని కామెంట్స్ చేశారు.

మరికొందరు మాత్రం అంతర్జాతీయ విద్యార్థులు అక్కడ బతకడం కోసమే పార్ట్‌టైమ్ జాబ్స్ చేయాల్సి వస్తోందని, వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలని వాదించారు.ఇంకొందరైతే.

అసలు సరైన సపోర్ట్ ఇవ్వకుండా వేలకు వేలు ఫీజులు తీసుకుని, ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను చేర్చుకుంటున్న UK యూనివర్సిటీలదే తప్పు అని విమర్శించారు.డిగ్రీ ఒక్కటే ఉంటే సరిపోదని, స్కిల్స్, కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం అనే మాట నూటికి నూరు పాళ్లు నిజమేనని మరికొందరు ఒప్పుకున్నారు.

తాజా వార్తలు