వామ్మో, ఏకంగా ఎనిమిది కాళ్లతో పుట్టిన దూడ.. ఎక్కడంటే..

పుట్టుక లోపాల వల్ల మనుషులతో పాటు జంతువులు కూడా చాలా వింతగా పుడుతుంటాయి.ఇప్పటికే వింతగా పుట్టిన జంతువుల గురించి మనం ఎన్నో కథలు విన్నాం.

కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక దూడ ఏకంగా ఎనిమిది కాళ్లతో జన్మించింది.సాధారణంగా ఒక దూడకు నాలుగు కాళ్ళే ఉంటాయి.

కానీ ఇది 8 కాళ్లతో పుట్టడంతో అది పెద్ద వింతగా మారింది.ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారందరూ వింతగా పుట్టిన ఈ దూడను చూసేందుకు తరలి వస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, మురళినగర్‌లో నివసిస్తున్న ఓ రైతు ఇంట్లో ఇటీవల ఒక గేద దూడకు జన్మనిచ్చింది.

Advertisement
Lamb Born With 8 Legs In East Godavari District Viral Details, East Godavari, We

దేవిశెట్టి రత్నాజీ అనే రైతు ఈ గేదెను పెంచుకుంటున్నాడు.అయితే కడుపుతో ఉన్న తన ఆవు ఆరోగ్యకరమైన దూడకు జన్మనిస్తుందో అని ఆశపడ్డ అతనికి చివరికి నిరాశే మిగిలింది.

ఈ గేదె 8 కాళ్లు కలిగిన దూడకు జన్మించింది.ఈ దూడకు రెండు వెన్నుముకలు, 8 కాళ్లు ఉన్నాయి.

తల మాత్రం ఒక్కటే ఉంది.అయితే ఎనిమిది కాళ్లతో చాలా బలహీనంగా పుట్టిన ఈ దూడకు పశు వైద్యులతో మెడికల్ చెక్ అప్ చేయించాడు యజమాని.

Lamb Born With 8 Legs In East Godavari District Viral Details, East Godavari, We

దానిని చెక్ చేసిన తర్వాత జన్యుపరమైన లోపాల వల్ల ఈ దూడ పుట్టినట్లు వైద్యులు చెప్పారు.కాగా ఇలాంటి దూడలు ఎక్కువకాలం బతకడం కష్టమనే నిజం చాలామందిని బాధపడేలా చేస్తోంది.ఈ దూడను చూస్తుంటే రెండు పుట్టాల్సిన దూడలు జన్యుపరమైన లోపాల వల్ల ఇలా ఒకే దూడగా పుట్టినట్లు అర్థమవుతోంది.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
దీన్ని చూస్తే.. నిజంగానే ఇషాన్ కిషన్ 'మ్యాచ్ ఫిక్సింగ్' చేసాడనే అనిపిస్తోంది!

దూడ తల మధ్యలో ఉంటే వెనుకవైపు, ముందువైపు రెండువైపులా కాళ్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు